గొడవపై క్లారిటీ ఇచ్చిన ‘ఎంసీఏ’ టీం

MCA Team Clarifies On Nani And Sai Pallavi Fought In MCA Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత మూడు నాలుగు రోజులుగా హీరో నాని, హీరోయిన్‌ సాయి పల్లవిలు ‘మిడిల్‌క్లాస్‌ అబ్బాయి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో గొడవ పడ్డారు అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరు మంచి ప్రతిభ ఉన్న హీరో, హీరోయిన్‌. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా అద్బుతంగా వస్తుందని ప్రేక్షకుల అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గొడవ జరగడంతో ప్రేక్షకులు మరియు నాని ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు గొడవ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో నాని, లావణ్యలు గొడవ పడ్డట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, వారిద్దరు కూడా దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు ఆన్‌ కెమెరా, ఆఫ్‌ కెమెరా కూడా చక్కని కెమిస్ట్రీతో ముందుకు సాగుతున్నారని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటూ దిల్‌రాజు ఆఫీస్‌ వర్గాల వారు చెబుతున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. దిల్‌రాజు నిర్మాత అవ్వడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయమై నాని లేదా సాయి పల్లవి స్పందించాలని ప్రేక్షకులు కోరుకోగా, చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.