పూనం అంటే మీడియాకు భయమా..?

Media Didn't Highlight Punam Malakondaiah In medical Scam Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఏ పత్రికా అంత ప్రముఖంగా ఇవ్వలేదు. జగన్ పత్రిక సాక్షిలో కూడా రాలేదు. ఎవరో అడ్రస్ లేని వ్యక్తి ముక్కుసూటి మనిషిగా పేరున్న వ్యక్తిపై ఆరోపణలు చేస్తే కవర్ చేయాలా అన్నట్లుగా మీడియా వైఖరి ఉంది.

సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండయ్య ఎంత స్ట్రిక్టో అందరికీ తెలుసు. ఆమె ఏ శాఖలో పనిచేసినా.. అక్కడ వ్యవస్థను చక్కదిద్దారు. పూనం ఉంటే పొలిటీషియన్స్ కూడా రూల్ ప్రకారమే వెళ్తారనే పేరుంది. అలాంటి అధికారిపై మెడికల్ స్కాం ఆరోపణలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఒకటికి రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా.. పూనం గురించి న్యూస్ రాకపోవడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. పూనం పేపర్ ఆఫీసులకు ఫోన్ చేసి బెదిరించాలని చెబుతున్నారు. కానీ నిజంగా అలా చేసి ఉంటే.. అది పెద్ద గొడవ అవుతుంది. కానీ పూనం మీద నమ్మకంతోనే మీడియా కామ్ గా ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలు:

వైసీపీలో మంత్రి రాజయ్యాడా ?

హరీష్ రావుని సైడ్ చేశారా..?

బ్రాహ్మణుల తరహాలో వైశ్య కార్పొరేషన్