చరణ్‌ నిర్మాణంలో చిన్నల్లుడి ఎంట్రీ

megha-daughter-srija-husband-entry-into-the-production-of-charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను కళ్యాణ్‌ రెండవ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. మంచి బిజినెస్‌ మన్‌ కొడుకు అయిన కళ్యాణ్‌ ఎందుకు చిరంజీవి కూతురును రెండవ వివాహం చేసుకోవాల్సి వచ్చిందో అని అంతా కూడా అవాక్కయ్యారు. అయితే కళ్యాణ్‌కు హీరో అవ్వాలనే కోరిక ఉండటం వల్లే చిరంజీవి అల్లుడు అయ్యాడని, శ్రీజకు అప్పటికే పెళ్లి అయ్యి, కూతురు ఉన్నా కూడా సినిమాలపై మోజుతో పెళ్లి చేసుకున్నాడనే టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటో తెలియదు కాని, త్వరలో కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారు అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సంవత్సరం కాలంగా యాక్టింగ్‌, డాన్స్‌, యాక్షన్‌ ఇలా అన్ని విభాగాల్లో కూడా సీరియస్‌గా కళ్యాణ్‌ శిక్షణ తీసుకున్నాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలోనే కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పలు కథలను చిరు అండ్‌ ఫ్యామిలీ కళ్యాణ్‌ కోసం వినడం జరిగింది. ఒక మాస్‌ ప్రేమ కథతో కళ్యాణ్‌ను హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మెగా ఫ్యామిలీ నిర్ణయించుకుంది. చరణ్‌ ఇటీవల సొంతంగా కొణిదెల ప్రొడక్షన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఆ ప్రొడక్షన్‌లోనే కళ్యాణ్‌ హీరోగా భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. కళ్యాణ్‌ మొదటి సినిమాకు దాదాపు 40 నుండి 50 కోట్లు ఖర్చు చేసేందుకు చరణ్‌ నిర్ణయించుకున్నాడు. నిర్మాణ భాగస్వామిగా కళ్యాణ్‌ కూడా వ్యవహరించనున్నాడు. ఒక స్టార్‌ దర్శకుడికి భారీ పారితోషికం ఇచ్చి కళ్యాణ్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నారు. వినాయక్‌ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సంవత్సరం చివర్లో దర్శకుడి పేరును ఖరారు చేయనున్నారు.