ఎన్టీఆర్,చరణ్ చిత్రం చెప్పిన మాట.

megha-hero-ram-charan-appreciates-jr-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ పక్క పోటీ పడుతూనే, ఇంకో పక్క ఆ పోటీ పడే వాళ్ళ తోనే స్నేహం చేయాలంటే నిజంగా అగ్నిపరీక్ష. మాములు జనం అయితే నచ్చితే కలిసిపోతారు. కాదనుకుంటే దూరం అవుతారు. రాజకీయాలు, సినిమాలు చేసే వాళ్లకి ఇదంత తేలిక కాదు. ఇష్టం వున్నా,లేకపోయినా చాలా సందర్భాల్లో వారిని కలవాల్సి ఉంటుంది,వేదికలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇక అలాంటి సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రపంచం చెవులు రిక్కించి మరీ వింటుంది. అందుకే ఆ సెలెబ్రెటీలకు స్నేహం, కెరీర్ రెండూ పెద్ద పరీక్షే.

కాలంతో పాటు అన్నీ మారిపోతున్నట్టే ఈ పరీక్షని తట్టుకోవడంలో నేటి తరం నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్,అక్కినేని హయాంలో ఆ ఇద్దరి మధ్య పోటీ ఒక్కసారి ఇద్దరి మధ్య మాటలు లేకుండా చేసింది. ఓ విధంగా చూసుకుంటే ఆ ఇద్దరు పంతాలు,పట్టింపులకు పెద్ద పీట వేసే పల్లెల నుంచి వచ్చారు. అప్పటికి సినిమా అంటే కూడా జనానికి కొత్త వినోదమే. అయితే అందులో నిలదొక్కుకుని ఎవరి స్థానం వాళ్లకి ఉంటుందని గ్రహించాక తమ మధ్య పోటీని తెర కి మాత్రమే పరిమితం అనుకోగలిగారు. ఆ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ అయితే ఈ ఇద్దరు దిగ్గజాలతో సినిమాల విషయంలో ఎన్నో సందర్భాల్లో పోటీ పడినా, ఎన్టీఆర్ తో రాజకీయం గా విభేదించి సినిమాలు తీసినా వ్యక్తిగతంగా ఆయనే నా అభిమాన నటుడు అని ప్రకటించగలిగారు. ఇక ఎన్టీఆర్ సైతం కృష్ణ దూకుడుని భరించగలిగారు.

ఇక తరువాత తరంలో చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున వెండితెర మీద పోటీ పడుతూనే ఆ ప్రభావం వ్యక్తిగత జీవితం మీద పడకుండా చేసుకోగలిగారు. ఓ పక్క ఫాన్స్ ఎంత గొడవపడుతున్నా ఈ తరం నటులు వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. అంత పోటీలోనూ నాకు చిరు మంచి మిత్రుడని బాలయ్య, బాలయ్య ఆప్తుడని చిరంజీవి చెప్పుకోగలిగారు.ఇక నాగ్ అందరు హీరోలతో ఎంత స్నేహంగా వుంటారో చెప్పక్కర్లేదు. వెంకీ పక్క హీరో స్టార్ డమ్ ని మనసారా ఆస్వాదించగలిగిన మంచి మనసున్న మనిషి. అయినా ఈ తరం నటులు తాము స్నేహాన్ని కొనసాగించారు గానీ ఫాన్స్ లోకి ఆ భావాన్ని బలంగా తీసుకెళ్లలేకపోయారు.

ఎన్టీఆర్,చరణ్ చిత్రం చెప్పిన మాట. - Telugu Bullet

ఇక ఇప్పుడు కొత్త తరం వచ్చింది. పైన మనం చూస్తున్న ఎన్టీఆర్, చరణ్ ఫోటో ఒక్కటి చాలు, ఈ తరం ఆలోచనలు, ఆచరణ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఇక్కడ పోటీ వుంది.కానీ పక్క హీరో విజయాన్ని కూడా ఆస్వాదించే పరిణితి కూడా వుంది. ప్రతి క్షణం పోలికలు,పందేలు మనతో పక్కవాడి జీవితాన్ని కూడా టెన్షన్ లోకి తీసుకెళ్తాయన్న అవగాహన వుంది. ఇక్కడ గెలుపు కన్నా జీవితాన్ని ఆస్వాదించడమనే ఇంకో గొప్ప విషయం ఉందన్న పరిణితి వుంది. అందుకే వయసుకి చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో తమ కోసం కొట్టుకోవద్దని మాటలతో కాదు ఇలా చేతలతో చెప్పేస్తున్నారు. జైలవకుశ హిట్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ ని అభినందిస్తున్న చరణ్ ని చూసి అయిన నందమూరి, మెగా అభిమానులు ఏమి నేర్చుకోవాలి ప్రత్యేకంగా చెప్పాలా?