ముగ్గురిలో ఒకరు కాదు.. ముగ్గురు!

megha-star-chiranjivi---doi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Megha Star Chiranjivi   Doing With Three Heroines

చిరంజీవి 151వ ఉయ్యాలవాడ ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఖైదీ నెం.150 చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న చిరంజీవి మరోసారి అదే స్థాయి సక్సెస్‌ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం అయినా పక్కా ప్లానింగ్‌తో తర్వాత సినిమాను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో మంచి సబ్జెక్ట్‌ను సిద్దం చేయిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా సురేందర్‌ రెడ్డి ఉయ్యాలవాడ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. ఎట్టకేలకు స్క్రిప్ట్‌  ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గురించి గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. చిరంజీవికి జోడీగా ఐశ్వర్య రాయ్‌, అనుష్క, నయనతారల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నట్లుగా తెలుస్తోంది.

మెగా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కథానుసారంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ అవసరం ఉందట. దాంతో ఆ ముగ్గురు హీరోయిన్స్‌గా ఐశ్వర్య రాయ్‌, అనుష్క, నయనతారలను ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురితో ఇప్పటికే చర్చలు జరిపారు. అనుష్క, నయనతారల పాత్రలు రెగ్యులర్‌గా ఉంటాయి. కాని ఐశ్వర్య రాయ్‌ పాత్ర మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఆమె కనిపించేది కొద్ది సమయం అయినా కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, చిరంజీవికి ఆమెకు మద్య సీన్స్‌ లేకున్నా ఆమె సినిమాకు ప్లస్‌ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని సినిమా ప్రారంభం అయిన సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు

అప్పుడే మొదలెట్టిన చరణ్‌

ముగ్గురిలో ఒకరు కాదు.. ముగ్గురు! - Telugu Bullet