అదే పని రోజా చేస్తే తప్పెందుకు ?

MLA roja not attend ysrcp save vishaka maha dharna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సేవ్ విశాఖ పేరుతో వైసీపీ నిర్వహించిన మహా ధర్నా లో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా కనిపించకపోవడం మీద ఎక్కడ లేని చర్చ సాగుతోంది. ఆమె అనారోగ్యంతో ఈ సభకి దూరంగా వున్నారని వైసీపీ చెబుతున్న మాటలు నమ్మేట్టుగా లేవు. అదే సమయంలో డబ్బులు తీసుకుని సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రోజాకి నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమై ఉంటుందని ఎక్కువమంది నమ్ముతున్నారు కూడా. అయితే పార్టీ తో సంబంధం లేకుండా రోజా వాగ్ధాటికి ముచ్చటపడేవాళ్లు కొందరు వున్నారు. వాళ్ళు మాత్రం రోజా మౌనం, అస్త్ర సన్యాసాన్ని తట్టుకోలేకపోతున్నారు. పైగా రోజా అభిమానులు జగన్ వైఖరిని తప్పుబడుతూ ఓ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఏ నోటి దూకుడు తగ్గించుకోమని రోజాకి సలహా ఇచ్చారో విశాఖ సభలో అదే నోటి దూకుడు జగన్ ప్రదర్శించడాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు.

విశాఖ మహాధర్నాలో జగన్ మాట తూలారు. భూకుంభకోణం కేసుని సిబిఐ కి అప్పగిస్తే సీఎం చంద్రబాబు, లోకేష్ సహా ఇందులో భాగమున్న ఇతర మంత్రులు, అధికారుల్ని లోపల వేసి తంతారని జగన్ వ్యాఖ్యానించారు. ఓ ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ ఇలాంటి మాటలు వాడగా లేనిది రోజా దూకుడుగా మాట్లాడితే తప్పేంటని కొందరు నిలదీస్తున్నారు. ఒకప్పుడు సీఎం ని చెప్పుతో కొట్టమని పిలుపు ఇచ్చి జగన్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో రాష్ట్రమంతా చూడలేదా అని రోజా అభిమానులు నిలదీస్తున్నారు. ఇప్పుడు కూడా జగన్ మాటలకి మంత్రి దేవినేని ఉమా అదే స్థాయిలో బదులు ఇచ్చారు. 12 కేసుల్లో ముద్దాయిగా వున్న జగన్ ని సిబిఐ వాళ్ళు ఎంతలా తన్నారో పాపం అంటూ దేవినేని ఉమా కౌంటర్ వెయ్యనే వేశారు. ఇలా జగన్ తనకు నచ్చినట్టు మాట్లాడితే లేని తప్పు రోజా మాట్లాడితే ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మొత్తానికి ఈసారి రోజా తీరు చూస్తుంటే వైసీపీ కి గుడ్ బై కొట్టి కొత్త దారి చూసుకునేట్టు వున్నారు.