తెలుగు, తమిళంకు ఒక్కటే..!

murugadoss gives clarity about on spyder movie climax

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రం మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్‌ మొత్తం పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేయనున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. అందులో కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. పుకార్లపై దర్శకుడు మురుగదాస్‌ క్లారిటీ ఇచ్చాడు.

ముఖ్యంగా వచ్చిన పుకార్లలో తెలుగు మరియు తమిళంకు వేరు వేరుగా క్లైమాక్స్‌ల చిత్రీకరణ ఉంది. తెలుగుకు మరియు తమిళంకు విడి విడిగా క్లైమాక్స్‌ ఉండటంకు ప్రధాన కారణం తమిళంలో యాంటీ క్లైమాక్స్‌ అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై మురుగదాస్‌ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు మరియు తమిళంలో పూర్తిగా సేమ్‌ సీన్స్‌ ఉంటాయని, క్లైమాక్స్‌ కూడా సేమ్‌ ఉంటుందని, ఎక్కడ కూడా తేడా ఉండదని, క్లైమాక్స్‌ తెలుగు మరియు తమిళ భాష ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని దర్శకుడు మురుగదాస్‌ క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డి మాటలు శృతిమించుతున్నాయి

సైరా నరసింహారెడ్డి.. టైటిల్‌ వివాదం

స్పైడ‌ర్ లో బ్రిజేశ్ శాండల్య పాట‌