విశాఖలో సైబర్ టవర్స్

Cyber Tower renamed Tech Hub

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీకి దిక్సూచిగా మారిన సైబర్ టవర్స్ తరహాలో విశాఖలో కూడా అలాంటి టవర్స్ కు ఏపీ సర్కారు ప్రారంభించబోతోంది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు సైబర్ టవర్స్ ప్రారంభించగా.. ఇప్పుడు బాబు వారసుడు లోకేష్ విశాఖ సైబర్ టవర్స్ ఓపెన్ చేస్తున్నారు. పదకొండు అంతస్తుల్లో నిర్మించిన ఈ టవర్స్ రాకతో విశాఖ పేరు ఐటీ ఇండస్ట్రీలో మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పుడంటే హైదరాబాద్ సైబర్ సిటీలో చాలా బిల్డింగులున్నాయి. కానీ మొట్టమొదట బిల్డింగ్ సైబర్ టవర్సే. అదే ఐకానిక్ బిల్డింగ్ గా మారి.. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్ వచ్చాయి. ఇప్పుడు విశాఖ సైబర్ టవర్స్ ను కూడా అంతే అద్భుతంగా నిర్మించారు. ఇది చూశాక మరిన్ని ఐటీ కంపెనీలు ఏపీ బాట పడతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీ ఐటీ టర్నోవర్ రెండు లక్షల కోట్లుగా ఉంది. సైబర్ టవర్స్ ఇనాగరేషన్ తో కనీసం డబుల్ అవుతుందని, ఆ తర్వాత ట్రాక్ లో పడితే శరవేగంగా అభివృద్ధి సాధ్యమేనని చెబుతున్నారు. ఒక్క ఇంటర్నేషనల్ కంపెనీని తేగలిగితే ఆటోమేటిగ్గా అభివృద్ధి జెట్ స్పీడ్ లో వెళ్తుందని బాబు, లోకేష్ నమ్ముతున్నారు. అందుకే ఇద్దరూ ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు:

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!

చిన్నారుల‌కు ప్రేమ‌తో నేర్పిద్దాం…కోపంతో కాదు