ఇది పక్కా వైఎస్‌ జగన్‌ స్టోరీ

nene raju nene mantri movie similiar to ys jagan attitude

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nene Raju Nene Mantri Movie Similiar To Ys Jagan Attitude

రానా, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన ‘నేనేరాజు నేనేమంత్రి’ చిత్రం ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం రాజకీయాలకు అద్దం పట్టబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. రానా చెప్పిన పొలిటికల్‌ డైలాగ్‌లు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు తెరలేపుతున్నాయి. వంద మంది ఎమ్మెల్యేలను స్టార్‌ హోటల్‌లో కూర్చోబెడితే సాయంత్రం వరకు నేనే సీఎం అంటూ రానా చెప్పిన డైలాగ్‌ పలువురికి పలు రకాలుగా కొడుతుంది. ఈ డైలాగ్‌తో పాటు ఇంకా కొన్ని సీన్స్‌ కూడా ప్రస్తుత రాజకీయా నాయకులను గుర్తు చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే ఇదేదో జగన్‌ కథతో తెరకెక్కించినట్లుగా ఉంది. ఈ చిత్రంలో రానా అధికారం కోసం అడ్డం వచ్చిన వారిని ఏం చేసేందుకు అయినా సిద్దపడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. యువ నాయకుడిగా రానా సినిమాలో ఎదిగినట్లుగా చూపించనున్నారు. అలాగే జగన్‌ కూడా యువ నాయకుడిగా ఎదిగిన విషయం తెల్సిందే. రానా పాత్ర తీరు అచ్చంగా జగన్‌ నిజ జీవితానికి పోలి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది అస్సలు కాదు అని, అనవసరంగా వివాదాలు సృష్టించవద్దని కోరుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఇంకా ఎలాంటి సంచలనాలకు ఈ సినిమా కేంద్ర బింధువు అవుతుందో అనే చర్చ జరుగుతుంది.

మరిన్నివార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

అలాంటిదేం లేదన్న ఎన్టీఆర్‌