ఆస్కార్‌ రేసులో బాలీవుడ్‌ న్యూటన్‌

Newton Is India Official Entry For Oscar Nomination 2018

భారతీయ సినిమాలకు ఆస్కార్‌ అవార్డులు అందని ద్రాక్ష అవుతున్నాయి. ఆస్కార్‌ సాధించిన సినిమాలను చేతి వేళ్లపై లెక్కించుకోవచ్చు. అయినా కూడా ప్రతి సంవత్సరం ఆస్కార్‌ నామినేషన్‌కు ఇండియా నుండి సినిమాలు వెళ్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఆస్కార్‌ నామినేషన్‌కు పంపించేందుకు ఇండియన్‌ ఆస్కార్‌ జ్యూరీ మొత్తంగా 26 సినిమాలను స్క్రీనింగ్‌ చేయడం జరిగింది ఈ 26 సినిమాల్లో తెలుగు సినిమాలు అయిన ‘బాహుబలి 2’ మరియు బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు ఉన్నాయి. ఆ 26 చిత్రాల్లో బాలీవుడ్‌లో తెరకెక్కి ఇటీవలే విడుదలైన ‘న్యూటన్‌’ చిత్రానికి అవకాశం దక్కింది.

ఈ విషయాన్ని ‘న్యూటన్‌’ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన రాజ్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. 2018 ఆస్కార్‌ బరిలో న్యూటన్‌ నిలిచినందుకు సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులందరికి శుభాకాంక్షలు అంటూ రాజ్‌కుమార్‌ పోస్ట్‌ చేశాడు. ఒక సాదారణ ప్రభుత్వ ఉద్యోగి దేశంలోని ఎన్నికల పక్రియలో తీసుకు వచ్చిన మార్పులు ఏంటి, వాటిని ఎలా కేంద్రంతో ఆమోదింపజేశాడు అనేది కథ. ఒక విభిన్న కథతో పాటు, అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు మసుర్కర్‌ తెరకెక్కించాడు. మరి ఈ చిత్రాన్ని ఆస్కార్‌ వరిస్తుందా అనేది చూడాలి.