అదరగొట్టిన లై టీజర్…అబద్ధానికి అంత విలువా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

LIE Movie Teaser

14 రీల్స్ పతాకం మీద నితిన్ హీరోగా చేస్తున్న లై టీజర్ కొద్ది సేపటి కిందట విడుదల అయ్యింది. ఇప్పటిదాకా నితిన్ లో ఓ లవర్ బాయ్ ని చూడటానికే అలవాటైన తెలుగు ప్రేక్షకులకి సరికొత్త నితిన్ ని చూపించడంలో దర్శకుడు హను రాఘవపూడి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అ ఆ విషయాన్ని కొనసాగించడానికి నితిన్ ఏరికోరి, ఎదురు చూసి చూసి చేసిన సినిమా లై. నితిన్ నమ్మకం ఏమిటో ఈ టీజర్ చూస్తుంటే అర్ధం అవుతోంది. టీజర్ లో అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేకన్నా ఓవర్ అల్ గా సూపర్బ్ అని చెప్పుకోవాలి.

ఈ మధ్య కాలంలో సినిమాకి,కధకి, టైటిల్ కి ఇంత ప్రాధాన్యం ఇస్తున్న సినిమా ఇదే అనుకోవాలి. లై అని పేరు పెట్టడమే కాదు పురాణాల్లో సైతం అబద్ధం చేసుకొచ్చిన పనులు గుర్తు చేసింది. ఇది నిజంగా సర్పరైజ్. మనకి తెలిసిన విషయాలే అయినా ఓ అబద్ధం విలువ గురించి ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.