నివేదా పంట పండినట్లే..!

nivetha-thomas-remurastion-increase-1-crore-with-jai-lava-kusa-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్‌మన్‌’ మరియు ‘నిన్నుకోరి’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నివేదా థామస్‌కు మూడవ సినిమాతోనే ఎన్టీఆర్‌ సరసన ప్రతిష్టాత్మక ‘జైలవకుశ’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. తాజాగా విడుదలైన ‘జై లవకుశ’ చిత్రంకు ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ లభిస్తుంది. దాంతో నివేధా థామస్‌కు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

నివేదా థామస్‌కు ఈ చిత్రం తర్వాత వరుసగా ఆఫర్లు వస్తాయని మొదటి నుండే అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో పాటు నివేదా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో నివేధ పంట పండినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఈ అమ్మడు నాలుగు సినిమాలను క్యూలో ఉంచింది. త్వరలోనే వాటికి ఓకే చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. ‘జైలవకుశ’ సక్సెస్‌తో ఈ అమ్మడి పారితోషికం 50 లక్షల నుండి ఏకంగా కోటి రూపాయలకు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం.