ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఇచ్చిన హోమ్ వర్క్?

NTR to learn martial arts and lose weight for trivikram film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జైలవకుశ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కి ఏ టెన్షన్ లేదంట. సినిమా గారంటీ హిట్ , రేంజ్ ఏమిటన్నదే తేలాలి అన్నంత ధీమాగా ఉన్నారట ఎన్టీఆర్. అయితే సినిమా రిలీజ్ కి ముందు ఏ టెన్షన్ లేకపోయినా ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్ కి టెస్టింగ్ టైం మొదలు అయినట్టే అంటున్నారు. ఎన్టీఆర్ కి ఆ పరీక్ష పెడుతోంది ఇంకెవరో కాదు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్టీఆర్ అడిగి మరీ చేస్తున్న సినిమా కావడంతో దాని కోసం త్రివిక్రమ్ ఏమి చెప్పినా చేయడానికి ఎన్టీఆర్ రెడీ గా వున్నారు. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ తో చెప్పారట. అందుకు త్రివిక్రమ్ రెండు కోరికలు కోరారట. అందులో మొదటి కోరిక బరువు తగ్గడం అయితే రెండో కోరిక కొద్దిపాటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ. ఈ రెండు విషయాలు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది మార్చ్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందట.

ఇప్పటిదాకా ఎన్టీఆర్ పని చేసిన దర్శకులు అందరూ చెప్పే మాట ఒకటుంది. ఎన్టీఆర్ బోర్న్ ఆర్టిస్ట్ అని. ఆయన ఎంత పెద్ద సన్నివేశం అయినా, డైలాగ్ అయినా, డాన్స్ మూవ్ మెంట్ అయినా, యాక్షన్ ఎపిసోడ్ అయినా ఇలా చూసి అలా చేసేస్తాడని దర్శకులంతా చెబుతారు. అలాంటిది ఎన్టీఆర్ కి కెరీర్ లో తొలిసారి హోమ్ వర్క్ ఇచ్చే దర్శకుడు త్రివిక్రమ్ రూపంలో ఎదురు అయ్యాడు. అయినా త్రివిక్రమ్ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించడానికి ఎన్టీఆర్ ప్రిపేర్ అయిపోతున్నాడు. తొలి విడతగా పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో బరువు తగ్గడం మీద దృష్టి పెట్టే ఎన్టీఆర్ రెండో ఫేజ్ లో థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు పనులు అంటే త్రివిక్రమ్ ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేసుకుని సరికొత్త అవతారంలో తారక్ తన అభిమానుల్ని ఆలరించబోతున్నాడట.

మరిన్ని వార్తలు:

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ కు 24 గంట‌ల్లో 7.54 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌

రాజమౌళికి చైతూ సినిమా నచ్చలేదు

చైతూ, సామ్‌ రిసెప్షన్‌ అప్‌డేట్స్‌