అలాంటిదేం లేదన్న ఎన్టీఆర్‌

ntr-not-doing-guest-roll-in

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ntr Not Doing Guest Roll In Mahanati Savithri

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకున్న తొలితరం కథానాయిక సావిత్రి. ఎన్నో అద్బుత పాత్రలు పోషించి హీరోయిన్‌ అనే పేరుకు అర్థం తీసుకు వచ్చిన ఆమె మహానటిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్‌ పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు జోరుగా ప్రసారం అవుతున్నాయి. తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది.

‘మహానటి’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించేందుకు కమిట్‌ అయ్యాడని, అందుకోసం డేట్లు కూడా ఇచ్చాడు అని వస్తున్న వార్తలు నిజం లేదని, ఎన్టీఆర్‌ వద్దకు అలాంటి ప్రపోజల్‌ రాలేదు, ఎన్టీఆర్‌ ఓకే చెప్పలేదు అంటూ నందమూరి వర్గాలు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ‘బిగ్‌బాస్‌’ తెలుగు రియాలిటీ షోను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఇంత బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ గెస్ట్‌ రోల్స్‌ చేయడం, ఇతర ప్రాజెక్ట్‌లను చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘మహానటి’లో ఎన్టీఆర్‌ ఉంటే సినిమా స్థాయి పెరుగుతుందని ఊహించుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

మరిన్ని వార్తలు

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ

బాలయ్యకు వీరిద్దరే దిక్కా?

ఇంట్లోనైనా కూర్చుంటా కాని వాటికి ఒప్పుకోను