తమిళ గడ్డపై మూడు ముక్కలాట

Political Disturbances in Tamilnadu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Political Disturbances in Tamilnadu

తమిళనాడులో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. దినకరన్ ను పక్కనపెట్టి పళని, పన్నీర్ ఒక్కటవుతారన్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరేలా లేవు. ప్రధాని మోడీ ఢిల్లీలో పళనికి అపాయింట్ మెంట్ ఇచ్చి, పన్నీర్ కు ఇవ్వకపోవడం ఊహాగానాలకు తావిస్తోంది. అటు దినకరన్ కూడా శశికళ తరహాలో రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టడం కలకలం రేపుతోంది.

అసలు పళని, పన్నీర్ కు ఏమైంది , ఎందుకు మళ్లీ దినకరన్ కు ఛాన్సిచ్చారనేది తమిళ ప్రజలకు, అన్నాడీఎంకే కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. తనకు ముప్ఫై మంది ఎమ్మెల్యేల మద్దతుందని దినకరన్ ప్రకటించారు. ఇటు డీఎంకే కూడా అవిశ్వాసం పెడతామని బెదిరిస్తోంది. ఉన్నట్లుండి ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు ముంబై నుంచి చెన్నై చేరుకోవడం ఇంకా విడ్డూరంగా ఉంది.

గవర్నర్ రాకతో చెన్నై పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. దినకరన్ సైలంట్ గా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పళని కూడా వీలైనంత త్వరగా పన్నీర్ ను దగ్గర చేసుకుంటే పార్టీ నిలబడుతుంది. లేదంటే మళ్లీ చిన్నమ్మ పెద్దమ్మై కూర్చుకుంటుంది. ఇదే విషయం మోడీ అర్థమయ్యేలా చెప్పారట. మరి ఈసారైనా కథ సుఖాంతమవుతుందో.. లేదో.

మరిన్ని వార్తలు: