ట్రిపుల్ త‌లాక్ తీర్పుపై హ‌ర్షాతిరేకం

Positive Response From Muslim women's In Triple Talaq Ban

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్టీల‌క‌తీతంగా నేత‌లంతా స్వాగ‌తిస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఈ
తీర్పు చ‌రిత్రాత్మ‌క‌మ‌ని అభివ‌ర్ణించారు.  ఈ తీర్పు స‌మాన‌త్వ హ‌క్కును ప్ర‌సాదించింద‌ని,
మ‌హిళా సాధికార‌త‌ను ఇది శ‌క్తివంత‌మైన కొల‌మానం అని పీఎం ట్వీట్ చేశారు. తీర్పుపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు
అమిత్ షా హ‌ర్షం వ్య‌క్తంచేశారు. ఇది ఒక వ‌ర్గం గెలుపుగానో, ఇంకో వ‌ర్గం ఓట‌మిగానో చూడొద్ద‌ని కోరారు. కాంగ్రెస మాజీ
మంత్రి క‌పిల్ సిబాల్ సుప్రీం తీర్పు మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌ను ప‌రిర‌క్షిస్తుంద‌ని అన్నారు. తాము ఊహించిన,
కోరుకున్న తీర్పే వ‌చ్చింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ముస్లిం వ‌ర్గాల్లో ఈ తీర్పుపై పెద్ద
ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ముస్లిం మ‌హిళ‌లు ఈ తీర్పుతో త‌మ‌కు పెద్ద ఊర‌ట ల‌భించిన‌ట్టు
సంతోష‌ప‌డుతున్నారు. అటు ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కూడా తీర్పుపై స్పందించారు.

                 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌర‌వించాల్సి ఉంద‌న్న ఆయ‌న‌…కానీ దీన్ని అమ‌లు చేయ‌టం ఎంతో క‌ష్ట‌త‌ర‌మ‌ని
అభిప్రాయ‌ప‌డ్డారు. ట్రిపుల్ త‌లాక్ అనేది ఓ సామాజిక అంశ‌మ‌ని, స‌మాజంలో సంస్క‌ర‌ణ‌ల ద్వారానే మార్పు
తేవాల‌ని, చ‌ట్టాలు చేయ‌టం వ‌ల్ల లాభం ఉండ‌ద‌ని ఓవైసీ అన్నారు. ట్రిపుల్ తలాక్ ముస్లిం మ‌హిళ‌ల స్థితిగ‌తుల‌పై తీవ్ర
ప్ర‌భావం చూపుతోందంటూ దాఖ‌లైన పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచార‌ణ జ‌రిపింది. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు
ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బో్ర్డు నుంచి కూడా అన్ని అభిప్రాయాల‌నూ సేక‌రించిన త‌ర్వాత ఇది రాజ్యాంగ విరుద్ధ‌మంటూ
సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. స‌మాన‌త్వ హ‌క్కును ఈ ప‌ద్ధ‌తి అతిక్ర‌మిస్తోంద‌ని, దీనిపై నిషేధం
విధిస్తున్నామ‌ని స్ప‌ష్టంచేసింది.

మరిన్ని వార్తలు:

శిఖ‌ర్ ధావ‌న్‌కు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్ 

మీకు క‌నిపించేది స్మ‌శాన‌మే