కాంగ్రెస్ లో ఇక రాహుల్ జ‌మానా

Rahul Gandhi to Handover Congress Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ‌రాజు ప‌ట్టాభిషేకానికి ముహూర్తం ఖ‌రార‌యింది. నెహ్రూ, గాంధీ కుటుంబం నాలుగో త‌రం వార‌సుడు….ఇండియ‌న్ నేష‌నల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌యింది. ఎన్నో ఆటుపోట్ల‌ను, ఉత్తాన ప‌తనాలను చ‌విచూస్తూ…132 ఏళ్ల‌గా ప్ర‌స్థానం సాగిస్తున్న కాంగ్రెస్.లో మ‌రో అధ్యాయం మొద‌లు కానుంది. త‌ల్లి నుంచి అధ్యక్ష ప‌గ్గాలు స్వీక‌రించేందుకు కుమారుడు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ నెల 30వ తేదీని అందుకు ముహూర్తంగా నిర్ణ‌యించారు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే కాంగ్రెస్ ఉపాధ్య‌క్ష‌డు రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 30న ఆయ‌న్ను పార్టీ అధ్య‌క్ష‌పీఠంపై కూర్చోబెట్టాల‌ని సోనియాగాంధీ భావిస్తున్నారు. దానికి ముందు ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక‌యిన‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

ప‌దేళ్లు అధికారంలో ఉండి… 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోయిన‌ప్ప‌టినుంచి..ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా నాయ‌క‌త్వ మార్పుపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని డిమాండ్ వినిపిస్తోంది. సోనియాగాంధీ అనారోగ్యానికి తోడు..పార్టీకి యువ‌నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మ‌న్న డిమాండ్ త‌లెత్త‌డంతో…కొన్ని రోజులుగా దీనిపై పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థి తానే అని రాహుల్ ప్ర‌క‌టించిన త‌రువాత‌…ఆయ‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఖాయ‌మైంది. 19 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్న సోనియాగాంధీ…ఇక పార్టీలో పెద్ద‌త‌ర‌హా నాయ‌కురాలిగా మిగిలిపోనున్నారు. ఇక నుంచి కాంగ్రెస్ లో రాహుల్ జ‌మానా సాగానుంది.