రాజమౌళి కి గర్వం తెప్పించిన సినిమా.

rajamouli comments on NTR Jai Lava Kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జైలవకుశ సినిమా చూసిన సెలెబ్రెటీలు ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలు బయటికి చెబుతున్నారు. ఎందరు హీరోలు వున్నా ఎన్టీఆర్ అంటే ఇష్టం అని చెప్పే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా జైలవకుశ చూసారు. ఆ తర్వాత సినిమా , ఎన్టీఆర్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజెప్పారు. తారక్ ని ఉద్దేశించి రాజమౌళి అన్న మాటలు ఇవే …

” తారక్… ఈ సినిమా చూసి నా గుండె అపారమైన గర్వంతో నిండిపోయింది. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు. జై, జై ” అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నటనకు ఇండస్ట్రీ జనాలు అహో అనడం కొత్త కాకపోయినా ఆ మాటలు ఎన్టీఆర్ కి ఎంతో దగ్గరవాడైన రాజమౌళి నోటి నుంచి వింటే ఆ కిక్ వేరు. కాదంటారా ?