శివాని గ్లామర్‌ రోల్స్‌కు సిద్దమేనా?

Rajasekhar Daughter Shivani Accepts Glamour Roles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజశేఖర్‌ కూతురు శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారు అయ్యింది. అయితే ఆమె తెలుగులోనా లేక తమిళంలో ఎంట్రీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇటీవల నేను కూడా మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి అంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగులోనే శివాని మొదటి సినిమా ఉండే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నాయి. ఇక తెలుగులో వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు గ్లామర్‌ షోకు ఆమడ దూరంలో ఉంటున్నారు. మంచు లక్ష్మి మరియు నిహారికలు హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా వారు పద్దతిగా నటిస్తున్నారు. ఎక్కడ కూడా స్కిన్‌ షో చేయకుండా కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. వారి తరహాలోనే శివాని కూడా స్కిన్‌ షోకు దూరంగా ఉంటుందా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. 

రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోవాలి అంటే ఇతర హీరోయిన్స్‌ మాదిరిగా అందాల ఆరబోత చేయాల్సిందే, హీరోలతో ముద్దు సీన్‌లు, రొమాంటిక్‌ సీన్స్‌ ఇంకా అన్ని రకాల కాస్ట్యూమ్స్‌ను వేసుకోవాల్సిందే. అలా చేస్తేనే కమర్షియల్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ను దక్కించుకోగలరు. లేదు పద్దతిగా నటిస్తాను, చీరలోనే కనిపిస్తాను, చుడిదార్‌ను మించను అంటే ఒకటి రెండు సినిమాలు చేసి తట్టా బుట్టా సర్దేసుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పాల్సి ఉంటుంది. మరి శివాని చాలా కాలం ఉండాలి అంటే గ్లామర్‌ రోల్స్‌ చేయాల్సి ఉంటుంది. మరి శివాని గ్లామర్‌ రోల్స్‌కు సిద్దమేనా? ఆమె తల్లిదండ్రులు అయిన జీవిత రాజశేఖర్‌లు అందుకు ఒప్పుకుంటారా అనేది చూడాలి.