మోహన్‌బాబుతో నా వల్ల కాదనుకున్నా…

Rajasekhar reveals rejects Hanuman Junction movie with Mohan Babu

Posted November 13, 2017 (2 weeks ago) at 19:02 
రాజశేఖర్‌ సుదీర్ఘ కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ‘గరుడవేగ’ సక్సెస్‌ ఇచ్చిన సంతోషంతో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ప్రమోషన్‌లో తెగ బిజీ అయ్యారు. రాజశేఖర్‌ మరియు జీవితలు మాత్రమే కాకుండా వారి ఇద్దరు కూతుర్లు కూడా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. తాజాగా వీరు జీతెలుగులో ప్రసారం అయ్యే ప్రదీప్‌ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోలో పాల్గొన్నారు. ఆ షోలో పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో రాజశేఖర్‌ ఫ్యామిలీ షేర్‌ చేసుకున్నారు.

ఈ షోలో రాజశేఖర్‌, మోహన్‌బాబుల మద్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి ప్రదీప్‌ రాబట్టాడు. ఎడిటర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని మోహన్‌బాబు, రాజశేఖర్‌లతో చేయాలని ముందుగా భావించారు. ఇద్దరు ఒప్పుకోవడం, ఇద్దరికి అడ్వాన్స్‌లు ఇవ్వడం కూడా జరిగి పోయింది. త్వరలో షూటింగ్‌ అనుకుంటున్న సమయంలో ఒకరోజు మాట్లాడుతూ మీరు సరైన సమయంకు రావాలి అంటూ మోహన్‌బాబు రాజశేఖర్‌తో అనడం జరిగింది. అందుకు నా వల్ల కాదు, కాస్త టైం అటు ఇటు అయితే మన ఇద్దరి మద్య ఖచ్చితంగా గొడవ అవుతుంది, అందుకే మనం సినిమా చేయకపోవడమే మంచిది అంటూ రాజశేఖర్‌ వెంటనే మోహన్‌బాబుతో చెప్పారట. దాంతో ఆ సినిమా కాస్త జగపతి బాబు, అర్జున్‌లు కలిసి చేశారు. అది కాస్త భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే తామిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఉందని, అది ఖచ్చితంగా అవుతుందని రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.

SHARE