లక్ష్మీపార్వతికి రజని సారీ చెప్పాడా ?

rajanai kanth said sorry for Laxmi Parvathi

Posted September 14, 2017 (2 weeks ago) at 10:37 

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ విషయం అయినా ఆచితూచి మాట్లాడతారు. అందుకే ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం గురించి కూడా ఇంకా తర్జనభర్జన పడుతున్నారని తమిళ తంబీలు జోక్ లు వేసుకుంటున్నారు. అయితే రజని కూడా ఒకప్పుడు తొందరపాటుతో మాట్లాడి ఆ తర్వాత సారీ చెప్పారట. అది ఎవరికో కాదు తనకే అని స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి అంటోంది. వైస్రాయ్ ఉదంతం జరిగినప్పుడు సూపర్ స్టార్ రజని కాంత్ కూడా ఎన్టీఆర్, చంద్రబాబు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆగ్రహించిన రజని రెండు వర్గాల మధ్య సంధి కుదరకుండా అడ్డు పడుతోంది లక్ష్మీపార్వతి అన్న కోణంలో మాట్లాడారు. అప్పట్లో మోహన్ బాబు, చంద్రబాబు మంచి మిత్రులుగా ఉండేవారు. వారి తరపున రంగంలోకి దిగిన రజని చేసిన కామెంట్స్ లక్ష్మీపార్వతి ఇమేజ్ ని బాగా డామేజ్ చేశాయి. ఇక్కడిదాకా అంతా పత్రికల్లో వచ్చిన విషయమే. అయితే ఈ ఎపిసోడ్ కి కొనసాగింపు ఉన్నట్టు లక్ష్మీపార్వతి తాజాగా వెల్లడించింది.లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా రజని చేసిన కామెంట్స్ కి విపరీతమైన ప్రచారం వచ్చింది. అటు తమిళనాడులోనూ ఆయన చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగింది. తమిళనాట వాళ్ళప్పడి రామమూర్తి అనే ఆయన రజని కామెంట్స్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో రజని డిఫెన్స్ లో పడ్డారట. అప్పుడు ఆయన నేరుగా లక్ష్మీపార్వతి ఇంటికి వెళ్లి గతంలో చేసిన కామెంట్స్ కి సంబంధించి సారీ చెప్పారట. ఈ విషయాన్ని ఓ యు ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టారు లక్ష్మీపార్వతి. అదే ఇంటర్వ్యూ లో రజని తో దూకుడుగా మాటలాడించింది మోహన్ బాబు అని ఆరోపించారు. మోహన్ బాబుకి రాజ్యసభ సీటు రావడంలో తన పాత్ర కూడా ఉందని,అయితే చేసిన మేలు మరిచి తనని బలి పెట్టి ఎన్టీఆర్ ని గద్దె దించారని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. అయితే ఎన్టీఆర్ ని మోసం చేసిన మోహన్ బాబుకి హెరిటేజ్ విషయంలో చంద్రబాబు ఝలక్ ఇచ్చారని లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు. ఏదేమైనా, ఎన్ని సంవత్సరాలు గడిచినా వైస్రాయ్ ఎపిసోడ్ కి సంబంధించి ఏదో ఓ కొత్త విషయం బయటికి వస్తూనే వుంది.
మరిన్ని వార్తలు:

545 నుంచి 546 ఎప్పుడ‌య్యాయి?

ఆ కమెడియన్ కి బాబు థాంక్స్.

సంప‌న్న నేర‌స్థుల్లో రెండో స్థానంలో దావూద్