రెండు రెళ్ళు ఆరు…తెలుగు బులెట్ రివ్యూ.

Rendu Rellu Aaru Movie Review And Rating In telugu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్యానర్స్‌: వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌
తారాగణం: అనిల్‌ మల్లెల, మహిమ, సీనియర్‌ నరేష్‌, రవి కాలే, తాగుబోతు రమేష్‌,
ఛాయాగ్రహణం: వెంకట అమరనాథరెడ్డి
కూర్పు: జానకిరాం
సంగీతం: విజయ్‌ బుల్‌గానిన్‌
నిర్మాతలు: ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అందె
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందు మల్లెల

“రెండు రెళ్ళు ఆరు “…ఒకప్పుడు ఇదే టైటిల్ తో ప్రముఖ దర్శకుడు జంధ్యాల తీసిన సినిమా ఇప్పటికీ కామెడీ లవర్స్ ని అలరిస్తూనే వుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆ సినిమాకి ముఖ్యంగా అందులో కామెడీకి ఓ పేజీ ఉంటుంది.ఇప్పుడు అదే పేరు ఎంచుకుని వస్తున్నా ఈ సినిమా మీద మాములుగా అయితే పెద్దగా అంచనాలు ఉండవు. కానీ వారాహి సంస్థ కి ఇందులో ప్రమేయం ఉండటంతో అంచనాలు పెరిగాయి. నూతన దర్శకుడు నందు ఆ అంచనాల్ని నిలబెట్టాడో,లేదో చూద్దాం.

కథ…

అనూహ్య పరిస్థితుల్లో రాజు, రావు అనే ఇద్దరు తమకి పుట్టిన బిడ్డల్ని మార్చుకుంటారు. మార్చుకోవాల్సి వస్తుంది. అయినా ఆ రెండు కుటుంబాలు ఒకే కాలనీ లో ఉంటాయి. వాళ్ళ పిల్లలు పెద్దయి ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఈ మాడీ, మ్యాగీ ప్రేమ వారి తండ్రులకు ఇబ్బందులు సృష్టిస్తుంది. అసలు వాళ్ళు పిల్లల్ని ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది. ఆ పిల్లల ప్రేమ ఫలిస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే రెండు రెళ్ళు ఆరు చూడాలి.

విశ్లేషణ…

తొలి సినిమా డైరెక్ట్ చేస్తున్న నందు ఎంచుకున్న కథ ఆసక్తికరంగా, కధనం వినోదాత్మకంగా ఉండేలా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. అంతవరకు అతన్ని అభినందించాల్సిందే. పెద్ద బరువుని మోస్తూ తడబడడం కన్నా సరళమైన ప్లాట్ ని ఎంచుకోవడం వల్ల స్టోరీ నరేషన్ ఈజీ అయ్యింది. సీనియర్ నటులు నరేష్, రవి కాలే తో పాటు హీరో హీరోయిన్ పాత్రలు వేసిన అనిల్, మహిమ కూడా బాగా చేశారు. అయితే కామెడీ కుదిరినంత బాగా లవ్ ట్రాక్ కుదరకపోవడం కాస్త మైనస్ అనిపించింది. సాంకేతిక విభాగం కూడా పర్వాలేదనిపించింది. మ్యూజిక్, ఫోటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సాయి కొర్రపాటి విడుదల బాధ్యతలు తీసుకున్నందుకు ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని వెళ్లిన వారికి నిరుత్సాహం కలగదు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “రెండురెళ్ళు ఆరు” లెక్క తప్పలేదు.
తెలుగు బులెట్ రేటింగ్… 3 / 5 .