మీకు భ‌ద్రంగా అనిపించిన చోటుకు వెళ్లండి

rss-leader-indresh-kumar-shocking-reply-to-hamid-ansari-comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి దిగిపోతూ హ‌మీద్ అన్సారీ భార‌త్ లో ముస్లింలు అభ‌ద్ర‌తాభావంలో ఉన్నార‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై చెల‌రేగిన దుమారం ఇంకా చల్లార‌లేదు. అన్సారీ ఆ వ్యాఖ్య చేసిన మ‌రుక్ష‌ణం నుంచే రాజ‌కీయ ప‌క్షాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అన్సారీ మాట‌ల‌ను ప‌లువురు నేత‌లు ఖండించారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై ఆర్సెస్ ఘాటుగా స్పందించింది. ఇక్క‌డ భ‌ద్ర‌త లేద‌ని భావిస్తే..

ప్ర‌పంచంలో త‌న‌కు భ‌ద్రంగా అనిపించిన చోటుకు అన్సారీ వెళ్లిపోవ‌చ్చ‌ని ఆరెస్సెస్ సీనియ‌ర్ నేత ఇంద్రేష్ కుమార్ వ్యంగాస్త్రం విసిరారు. అన్సారీ స‌హా భార‌త్ లో అభద్ర‌తాభావంలో ఉన్నామ‌ని భావించే వాళ్లంతా…ప్ర‌పంచంలో ముస్లింలు సుర‌క్షితంగా ఉన్న దేశం పేరు చెప్పి అక్క‌డ‌కు నిరభ్యంత‌రంగా వెళ్ల‌వ‌చ్చ‌ని ఇంద్రేష్ కుమార్ నాగ్ పూర్ లో వ్యాఖ్యానించారు. అన్సారీ వ్యాఖ్య‌ల‌ను దేశంలో ఎవ‌రూ విశ్వ‌సించ‌టం లేద‌ని, ముస్లింలు కూడా ఆయ‌న మాట‌ల‌ను వ్య‌తిరేకించార‌ని ఇంద్రేష్ అన్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రాజీనామా చేసిన మ‌రుక్ష‌ణం అన్సారీ కుహ‌నా లౌకిక‌వాదిగా

మారిపోయార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అన్సారీ వ్యాఖ్య‌ల‌ను ఆరెస్సెస్, బీజేపీతో పాటు అనేక పార్టీలు ఖండించాయి. రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచేసి మిస్ట‌ర్ క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న అన్సారీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. సోష‌ల్ మీడియా అయితే తీవ్రంగా స్పందించింది. అన్సారీకా జీహాద్ అంటూ విరుచుకుప‌డింది. అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌సంగంలో ఈ వ్యాఖ్య‌లు చేసిన అన్సారీ…త‌రువాత మాత్రం నోరుమెద‌ప‌లేదు. త‌న‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌ల‌కు క‌నీస స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు.

మరిన్ని వార్తలు: