హిందీలో ‘ఫిదా’ చేయగలరా?

sai-pallavi-and-varun-tej-fidaa-movie-going-to-remake-in-bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని, పెద్ద సినిమాల కలెక్షన్స్‌ను సైతం క్రాస్‌ చేసేసింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఫిదా’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో సాయి పల్లవి ‘ఫిదా’ చేసింది. ఆ స్థాయిలో హిందీలో హీరోయిన్‌ ఆకట్టుకుంటే తప్ప సినిమా ఆడదు, ఆ విషయం దిల్‌రాజుకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయంపై నమ్మకం ఉండి, ఆయన మనస్సులో ఎవరో హీరోయిన్‌ ఉండటం వల్లే ‘ఫిదా’ రీమేక్‌కు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. 

తెలుగులో సాయి పల్లవి యాస సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ కారణంగా కూడా సినిమా ఇంతగా సక్సెస్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘ఫిదా’ చిత్రం పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు రెట్ల లాభంను రాబట్టింది. ఇంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది కనుకే హిందీలో స్వయంగా నిర్మిస్తాను అని దిల్‌రాజు అంటున్నాడు. మరి తెలుగులో అయినట్లుగా హిందీలో ప్రేక్షకులను ‘ఫిదా’ చేయడంలో దిల్‌రాజు సఫలం అవుతాడో చూడాలి.

మరిన్ని వార్తలు:

హిందీ ప్ర‌స్థానంలో సంజ‌య్ ద‌త్‌?

బాల‌కృష్ణ సినిమాలో న‌య‌న‌తార హోమ్లీ లుక్‌

హిందీలో ‘ఫిదా’ చేయగలరా? - Telugu Bullet