నిర్మాత లేదా దర్శకుడితో పడుకోవడం వ్యక్తిగతం

Singer Andriya Sleeping With Producer Or Director Is Personal

Posted November 6, 2017 (3 weeks ago) at 20:28 

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కొందరు హీరోయిన్స్‌ అవకాశాలు దక్కించుకోవాలి అంటే దర్శకుడు, హీరో లేదా నిర్మాతల కోరిక తీర్చాల్సిందే అని, ప్రస్తుతం స్టార్‌ హోదాలో ఉన్న హీరోయిన్స్‌ అంతా కూడా వారిని సంతృప్తి పర్చి అవకాశాలను దక్కించుకున్న వారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాని స్టార్‌ హీరోయిన్స్‌ మాత్రం కొందరు తమకు అలాంటి పరిస్థితి రాలేదు అని, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్‌ కౌచ్‌ అనేది లేదు అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయమై తమిళ హీరోయిన్‌ ఆండ్రియా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ‘డిటెక్టివ్‌’ అనే విశాల్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆండ్రియా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఆండ్రియా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ… హీరోయిన్‌ దర్శకుడు లేదా నిర్మాతతో పడుకోవడం అనేది వారి వ్యక్తిగత విషయం. ఆ విషయాలను మీడియా పట్టించుకోవాల్సిన పని లేదు. అవకాశాల కోసం పడుకుంటున్నారా లేదా మరే కారణంగా పడుకుంటున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా ఈ విషయం గురించి ఆలోచించకుంటే బెటర్‌ అంటూ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది.

SHARE