రమ్యకు సోషల్ రివర్స్ పంచ్

Social Media Rivers Punch for social media affairs Incharge Ramya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

న్నడ నటి రమ్య సినిమాల్లో హాటు. రాజకీయాల్లో విమర్శల పరంగా చాలా ఘాటు. ఫైర్ బ్రాండ్ నేతగా పేరు మోసిన రమ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాల ఇంఛార్జ్ గా రమ్యను నియమించారు. అంతే రెచ్చిపోయిన రమ్య.. మొదటి పోస్ట్ తోనే కాంగ్రెస్ కార్యకర్తల్ని బెంబేలెత్తించింది.
ఉత్తరాదిన వర్షాలు పడుతున్నా మోడీకి చూడటానికి తీరిక లేదని విమర్శలు కురిపించిన రమ్య.. ప్రధాని వరద బాధితుల్ని పరామర్శించిన ఫోటో ఉంటే ఒక్కటైనా పెట్టడంని, అలాంటి వారికి పాతికవేలు ఇస్తానని పోస్ట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు. ముందు సమకాలీన రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొంతమందైతే ప్రధాని వరద బాధిత ప్రాంతాల్లో తిరిగిన ఫోటోలు పెద్దసంఖ్యలో పోస్ట్ చేశారు.
దీంతో ఆ కామెంట్స్ అన్నింటినీ బ్లాక్ చేసి కామైపోయింది రమ్య. కాంగ్రెస్ లాగే రమ్య కూడా మాట తప్పిందని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారమంతా చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు రమ్యతో నష్టమే కానీ లాభం లేదని అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారట. బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా చెక్ చేసుకోకుండా మోడీపై దుమ్మెత్తిపోస్తే అది బీజేపీకే లాభమని వాళ్లు మొత్తుకుంటున్నారట.

మరిన్ని వార్తలు:

అందరివాడినంటున్న కామినేని

ఏపీలో ముచ్చటగా మూడో ఎన్నిక