సుమంత్‌ మరో ప్రయత్నం ‘మళ్లీ రావా..’

Posted ఆగస్ట్ 3, 2017 (3 weeks ago) at 14:12

MalliRaava Teaser
అక్కినేని వారి ఇంటి నుండి దాదాపు రెండు దశాబ్దాల క్రితం హీరోగా పరిచయం అయిన సుమంత్‌ ఇప్పటి వరకు కూడా హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ఇక తాను హీరోగా సక్సెస్‌ కాను అనుకున్నాడేమో సినిమాలు చాలా తగ్గించాడు. దాదాపు రెండు సంవత్సరాలకు ఒక్కటి అన్నట్లుగా సుమంత్‌ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా సుమంత్‌ ‘మళ్లీ రావా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుమంత్‌ సినిమా అంతకు ముందు ఆ తర్వాత వచ్చి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు సుమంత్‌ సినిమా అనగానే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ‘మళ్లీ రావా’ సినిమా టీజర్‌ను నేడు వదిలారు. టీజర్‌ చూస్తుంటే కథ కాస్త ఆసక్తిగా ఉండేట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్‌గా తెలిసిన స్టార్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేది. సినిమా కథను చూస్తుంటే హీరోయిన్‌ ప్రధానంగా సాగేలా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొత్త హీరోయిన్‌ను అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకుండా ఉన్న ఫేస్‌ను చూడటం అంటే కష్టమే. సరే హీరోయిన్‌ ఎలా ఉన్నా సుమంత్‌ బాడీ లాంగ్వేజ్‌ మరియు బాడీ కూడా పాత చింతకాయ పచ్చడి తరహాలోనే ఉంది. కాస్త కొత్తగా, విభిన్నమైన లుక్‌తో ట్రై చేస్తే బాగుండేది. సరే లుక్స్‌ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

మరిన్ని వార్తలు:

నక్షత్రం ప్రివ్యూ.

స్పైడర్‌ 16 కోట్లు.. జై లవకుశ 10 కోట్లు

మెగా అమ్మాయి తర్వాత మంచు అమ్మాయి

SHARE
Previous articleఅమరావతి మీడియా ఏడవలేక నవ్వింది.
Next articleజోగేంద్ర యువ గర్జనలో బిత్తిరి సత్తి సందడి
జర్నలిజం రంగంలో 20 ఏళ్ల సుధీర్గ అనుభవం కలిగిన కిరణ్ కుమార్ గారు ఈ వెబ్ సైట్ కి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.ప్రింట్,ఎలక్ట్రానిక్ ,డిజిటల్ మీడియా ...ఇలా మూడు రంగాలలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.సుప్రభాతం అనే వార పత్రిక తో మొదలైన జర్నలిస్ట్ ప్రస్టానం ఈటీవీ,మా టీవీ ,లోకల్ టీవీ,ఛానల్4,విస్సా టీవీ తో పని చేసిన అనుభవం తో పాటు రాజకీయ విశ్లేషణల మీద సాధికారత కలిగి వున్నారు .ఆయన నేతృత్వం లో తెలుగు బులెట్ వెబ్ సైట్ కూడా విలువలతో కూడిన ప్రయాణం సాగిస్తోంది...