సునీల్ తో త్రివిక్రమ్ సినిమా…

Sunil returns as comedian in Trivikram and NTR movie

Posted September 13, 2017 (2 weeks ago) at 17:02 
హీరో సునీల్ ఇకపై కమెడియన్ సునీల్ గా కూడా కనిపించబోతున్నాడు. హీరోగా మారాక కామెడీ పాత్రలు చేయకూడదని సునీల్ అప్పట్లో నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా పెద్ద విజయాలు ఏమీ రాకపోవడంతో కామెడీ రోల్స్ కి కూడా ఓకే చెబుదామని అనుకున్నాడు. అయితే ఆయన హీరోగా చేస్తున్న సినిమాల నిర్మాతలు, దర్శకులు అలా చేస్తే తమ ప్రోడక్ట్ దెబ్బ తింటుందని మొత్తుకోవడంతో ఆ ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్ళింది. అందుకే మెగా స్టార్ చిరు 150 వ సినిమాలో ఛాన్స్ వచ్చినా సునీల్ దాన్ని వాడుకోలేకపోయాడు. ఈ విషయాలు అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఇకపై హీరో పాత్రలతో పాటు కామెడీ వేషాలు కూడా వేస్తానని సునీల్ తాజాగా ప్రకటించాడు. కేవలం హీరోగా చేస్తే ప్రేక్షకులకి , తనకి మధ్య దూరం పెరుగుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునీల్ చెప్పారు.సునీల్ తాజా నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆయన ఏ సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తాడనే చర్చ మొదలైంది. సునీల్ తన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న సినిమా ముగింపు దశలో వుంది. అందులో సునీల్ నటించే అవకాశం లేదట. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. బహుశా ఆ సినిమా తోటే సునీల్ కమెడియన్ గా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

పెళ్లికి ఒకే ఒక్క స్టార్‌ హీరోను ఆహ్వానించనున్న చైతూ

సాహోలో డ్యూయ‌ల్ రోల్ కాదు