తెలంగాణ అనధికార సీఎం కేటీఆర్

Telangana State Unofficial CM KTR In Place Of KCR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Telangana State Unofficial CM KTR In Place Of KCR

కేసీఆర్ ఈ వారమంతా ఢిల్లీలోనే ఉంటారు. కాబట్టి సీఎం బాధ్యతలన్నీ కేటీఆరే చూస్తారని టీఆర్ఎస్ నేతలకు, ప్రభుత్వ అధికారులకు అనధికార ఆదేశాలు జారీ అయ్యాయట. కేసీఆర్ ఉన్నా కూడా వీలైనంతవరకూ బాగా ఫోకస్ అయ్యే కార్యక్రమాలకు తనయుడ్నే పంపిస్తున్నారు గులాబీ బాస్. ఇప్పుడీ కార్యక్రమానికి ఎక్స్ టెన్షన్ గానే కేటీఆర్ కు అనధికారికంగా సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెబుతున్నారు.

అసలు కేసీఆర్ ఓ దశలో తాను తప్పుకుని కేటీఆర్ ను సీఎం చేయాలని చూశారు. కానీ ఎంత ట్రై చేసినా హరీష్ బలం తరగకపోవడంతో.. తనయుడికి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో తాను ఉత్సవ విగ్రహంలా మిగిలి.. కుమారుడికే అగ్రపూజలు అందేలా స్కెచ్ వేస్తున్నారు. మామ అంతరంగం తెలిసిన హరీష్ కూడా ప్రస్తుతానికి హుందాగానే నడుచుకుంటున్నారు. అందుకే కేటీఆర్ ముందు జాగ్రత్తగా హరీష్ ను బుట్టలో వేస్తున్నారు.

కేటీఆర్ కు ఎప్పుడూ కేసీఆర్ ప్రాధాన్యమిస్తారు. కానీ ఈ సారి ఏకంగా డీజీపీ, సీఎస్ లాంటి ఉన్నతాధికారలుతో సమన్వయం చేసుకోమనడం అసాధారణమనే చెబుతున్నారు టీఆర్ఎస్ సీనియర్లు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాబోయే సీఎం కేటీఆర్ అనే నినాదంతో ముందుకు వెళ్తారేమోననే ప్రచారం జరుగుతోంది. సోనియా తరహాలో కేటీఆర్ ను పర్యవేక్షించే వ్యవస్థ ఏర్పాటు చేసి.. తాను కేటీఆర్ కు వెనుక నుంచి సహకరించాలనేది గులాబీ బాస్ వ్యూహం.

మరిన్ని వార్తాలు: