పాలిటిక్స్ లో కొత్త గ్లామర్

Upendra Announced His Political Entry

Posted ఆగస్ట్ 13, 2017 (2 weeks ago) at 13:15 

Upendra Announced His Political Entry

ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాది తారలకు మొదట్నుంచీ ఫాలోయింగ్ ఎక్కువే. హీరోలను దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం ఇక్కడ ఉంది. అందుకే ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారి బాటలోనే కొత్తతరం పాలిటిక్స్ లోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, తమిళనాడులో రజనీ, కమల్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరికి తోడుగా కన్నడ స్టార్ ఉపేంద్ర రంగంలోకి దిగాడు.

త్వరలో రాజకీయాల్లోకి వస్తానని అందుకు అభిమానుల సహకారం కావాలని ఉపేంద్ర ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఉప్పీ దాదా స్పీడ్ చూస్తుంటే 2019 ఎన్నికలకు యాక్టివ్ అయ్యేలా ఉన్నాడు. మరి అప్పటికి కొత్త పార్టీ పెడతాడా.. ఏదైనా పార్టీలో చేరతాడా అనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పటికే బీజేపీ ఉపేంద్రకు టచ్ లో ఉందనే మాట వినిపిస్తోంది.

ఉపేంద్ర సినిమాలు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అయినా సరే సమాజానికి సందేశాన్నివ్వడం మాత్రం అతడు మర్చిపోడు. వ్యవస్థలోని కుళ్లు కడిగిపారేయాలనే ఉద్దేశంతో.. చాలా బోల్డ్ డైలాగులు చెబుతాడు ఉపేంద్ర. మరి పాలిటిక్స్ లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తాడా.. ఫక్తు రాజకీయ నాయకుడిలా మాటలు మారుస్తాడా అనేది ఆసక్తికరమే.

మరిన్ని వార్తలు: