భార‌త్ పై ప్రేమ‌, పాక్ పై కోపం

US President Donald Trump Willing Strong Relations with India

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

భార‌త్ తో స‌త్సంబంధాల‌ను మ‌రింత బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని అమెరికా కోరుకుంటోంద‌ని ఆ దేశ‌ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్థాన్ పై త‌న వైఖ‌రి ప్ర‌క‌టించారు ట్రంప్‌. మీడియా ద్వారా అమెరికా ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ట్రంప్ ఉగ్ర‌వాదం విష‌యంలో పాక్ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై తీవ్రంగా మండిప‌డ్డారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు పాక్ స్వ‌ర్గ‌ధామంగా మారింద‌ని,  పాక్ లో ఉగ్ర‌వాదులు స్వ‌చ్ఛ‌గా తిరుగుతున్నార‌ని…దీన్ని అడ్డుకోవాల‌ని ట్రంప్ పాక్ ను కోరారు. పాక్ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోక‌పోతే చూస్తూ ఊరుకోబోమ‌ని  హెచ్చ‌రించారు. తాలిబ‌న్ లాంటి ఉగ్ర‌వాద సంస్థ‌లు ఆసియా దేశాల‌కు  ముప్పుగా మారుతున్నాయని, ఇక దీనిపై మౌనంగా ఉండేది లేద‌ని, ట్రంప్ అన్నారు.

ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పాక్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆ దేశం చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ముందే వార్త‌లొచ్చిన‌ట్టుగా.. ఆఫ్ఘ‌నిస్థాన్ పై అనుస‌రించే కొత్త వైఖ‌రిలో అమెరికా…భార‌త్ ను భాగస్వామి చేసింది. అఫ్ఘ‌నిస్థాన్‌, దక్షిణాసియా దేశాల‌పై అమెరికా త‌న వ్యూహాల‌ను మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని ట్రంప్ చెప్పారు. ప్ర‌పంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ‌మైన భార‌త్ త‌మ‌కు కీల‌క భ‌ద్ర‌త‌, ఆర్థిక భాగ‌స్వామి అని ట్రంప్ అన్నారు. పొరుగు దేశ‌మైన ఆఫ్ఘాన్ లో శాంతి, స్థిర‌త్వం తెచ్చేంద‌కు బార‌త్ మరింత చొర‌వ‌చూపాల‌ని కోరారు. ఆప్ఘాన్‌కు భార‌త్ ఎంతో స‌హ‌కారం అందిస్తోంద‌ని ట్రంప్ ప్ర‌శంసించారు. అయితే అమెరికాతో భార‌త్ బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారం చేస్తోంద‌ని, అలాగే ఆఫ్ఘాన్ కు ఆర్థికంగా మ‌రింత సాయం చేయాల‌ని కోరుకుంటున్నామ‌ని ట్రంప్ అన్నారు. మొత్తానికి ట్రంప్ ప్ర‌సంగం విదేశాంగ విధానంలో ఆ దేశ వైఖ‌రిలో వ‌చ్చిన మార్పును సూచిస్తోంది. ఒక‌ప్పుడు పాక్ ఏంచేసినా మ‌ద్ద‌తిచ్చిన అమెరికా వైఖ‌రిలో సెప్టెంబ‌రు 11 దాడుల  త‌ర్వాత మార్పు వ‌చ్చింది. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ను దారిలో పెట్ట‌క‌పోతే ప్ర‌పంచానికి ముప్పు త‌ప్ప‌ద‌న్న భావ‌న‌లో అమెరికా ఉన్న‌ట్టు స‌మాచారం.

మరిన్ని వార్తలు:

సాక్షిలో కోవర్టులెవరు జగన్..?

మళ్ళీ జట్టులోకి వచ్చిన డాషింగ్ ఓపెనర్….