‘హలో’ గురించి వర్మ అతి కామెంట్‌

varma-comments-on-akhil-hel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌గోపాల్‌ వర్మ ఏ విషయంలో స్పందించినా కూడా కాస్త అతిగానే స్పందిస్తాడు అనే విషయం తెల్సిందే. అది పాజిటివ్‌గా అయినా లేదా నెగటివ్‌గా అయినా కూడా అతిగానే ఉంటుంది. ప్రస్తుతం నాగార్జునతో వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. నాగార్జునతో ప్రస్తుతం సన్నిహితంగా ఉండాలి కనుక ఆయనకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్‌గా స్పందించాలి అనుకున్నాడో లేక మరేంటో కాని ‘హలో’ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హలో చిత్రం టీజర్‌ విడుదల పోస్ట్‌పై వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో తెగ చర్చకు తెర లేపింది.

varma

అఖిల్‌ కెరీర్‌లో అసలు సిసలు మొదటి సినిమా ఇది అని, పోస్టర్‌ మతి పోగొట్టే విధంగా ఉంది అంటూ వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం జరిగింది. అఖిల్‌ ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్‌ను కొట్టడం ఖాయం అంటూ వర్మ నమ్మకంగా చెబుతున్నాడు. వర్మ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. ఇదే అఖిల్‌ అసలు సిసలు మొదటి సినిమా అయితే వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్‌’ సినిమాను అవమానించినట్లే అని, దర్శకుడు వినాయక్‌ను వర్మ అవమానిస్తున్నాడు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో వర్మపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వర్మ ఏ విషయంలో స్పందించినా కూడా అతిగా, ఇలాగే స్పందిస్తాడు కనుక ఈ విషయమై ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని కొందరు లైట్‌ తీసుకుంటున్నారు. నేడు ‘హలో’టీజర్‌ విడుదల కాబోతుంది. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.