ఫిదా… తెలుగు బులెట్ రివ్యూ

varun tej fidaa Movie Review And Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు :  వరుణ్ తేజ్ , సాయి పల్లవి , సత్యం రాజేష్ 
నిర్మాత :  దిల్ రాజు 
దర్శకత్వం :  శేఖర్ కమ్ముల 
మ్యూజిక్ డైరెక్టర్ :  శక్తి కాంత్ 
ఎడిటర్ :  మార్తాండ్ కె. వెంకటేష్ 
సినిమాటోగ్రఫీ : విజయ్ సి. కుమార్ 

దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ అనగానే చిత్రసీమ లో ఓ విధమైన ఆసక్తి నెలకొంది. ఇక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ సాయి వరుణ్ తేజ్, దక్షిణాది మెరుపు తీగ సాయి పల్లవి కూడా ఆ దర్శక నిర్మాతలకి తోడు కావడంతో ఫిదా మీద అంచనాలు పెరిగాయి. ఫిదా ఆ అంచనాలకు తగ్గట్టు వుందో,లేదో చూద్దామా.

Fidaa Movie Story

వరుణ్ (వరుణ్ తేజ్ ) అమెరికాలో నివసిస్తున్న డాక్టర్. ఓ nri గా హాయిగా సాగిపోతున్న అతని జీవితంలో సోదరుడి పెళ్లి వ్యవహారం అనేక మార్పులకి దారి తీస్తుంది . అన్న పెళ్లి ఏర్పాట్ల కోసం ఇండియా వచ్చిన వరుణ్ పెళ్లికూతురు చెల్లెలుతో (సాయి పల్లవి ) తో ప్రేమలో పడతాడు. అయితే అక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. లవ్ , హేట్, లవ్ అనే టైటిల్ కాప్షన్ కి తగ్గట్టు హీరో ని హీరోయిన్ దూరం పెడుతుంది. చివరకు వాళ్ళు కలుస్తారా ,లేదా అన్నదే ఫిదా కథ.

Fidaa Movie Analysis

ఓ nri యువకుడు, నిండైన ఆత్మవిశ్వాసం వున్న ఓ తెలంగాణ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న శేఖర్ కమ్ముల ఆలోచనే ఫిదా. కధగా చూసుకుంటే చిన్న పాయింట్ అనిపించినా దాన్ని చుట్టూ అల్లుకున్న కధనం, భావోద్వేగాలు శేఖర్ కమ్ముల టాలెంట్ కి అద్దం పడతాయి. తనదైన గ్రౌండ్ లో బ్యాట్స్ మెన్ చెలరేగినట్టు లవ్ స్టోరీ ని హేండిల్ చేయడంలో శేఖర్ సూపర్ అని అనిపించకమానదు ఫిదా చూస్తుంటే. పాత కథ అయినప్పటికీ అందులో పాత్రల తాలూకా భావోద్వేగాలు సినిమా అయిపోయాక కూడా మనతో పాటు నడిచొస్తాయి. ఇక నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు బ్రాండ్ కేవలం నిర్మాణ విలువలకు పరిమితం అనిపిస్తుంది. ఈ బ్యానర్ లో ప్రతి సినిమా లో ఎక్కోడో చోట దిల్ రాజు బ్రాండ్ కనిపిస్తుంది. ఫిదా మాత్రం శేఖర్ కమ్ముల సినిమా అనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఫిదా దిల్ రాజు టేస్ట్ కి తగ్గ సినిమా.

ఇక హీరోగా సాయి వరుణ్ తేజ్ సున్నితమైన పాత్రకి అతికినట్టు సరిపోయాడు. కధకి తగ్గట్టుగా ఓ ప్రేమికుడిగా భావోద్వేగాల్ని బాగా పండించాడు. కొన్ని సీన్స్ చూస్తుంటే వరుణ్ నటనలో పరిణితి బాగా కనిపించింది. ఇంతమంది మధ్య కూడా టోటల్ గా ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంది మాత్రం హీరోయిన్ గా చేసిన సాయి పల్లవి. ఆమె నటన, తెలంగాణ వాచకం సూపర్బ్ అనే చెప్పాలి. చాన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన సాయి చంద్ సహా మిగతా నటీనటులంతా బాగా చేశారు. ఇక టెక్నిషియన్స్ పరంగా చూస్తే సినిమాటోగ్రాఫర్ విజయ్. సి. కుమార్ టేకింగ్ సూపర్. ఇక సంగీత దర్శకుడు శక్తి కాంత్ తనదైన ముద్ర వేసాడు. పాటలే గాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

Fidaa Movie Plus Points

ప్రేమ సన్నివేశాలు
ఎమోషనల్ సీన్స్
సాయి పల్లవి
వరుణ్ తేజ్
శేఖర్ కమ్ముల
విజయ్ .సి కుమార్
శక్తి కాంత్
ఫస్ట్ హాఫ్ .

Fidaa Movie Minus Points

సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగదీత
క్లైమాక్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్ … శేఖర్ కమ్ముల “ఫిదా ” చేసాడు.
తెలుగు బులెట్ రేటింగ్ … 3 .25 / 5 .