బాబోయ్‌… ఒక్కరోజులో కోటి వ్యూస్‌

Vijay mersal movie teaser crossed 1 crore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో పవన్‌, మహేష్‌లకు ఏ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు మించి తమిళంలో విజయ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. విజయ్‌ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక విజయ్‌ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సోషల్‌ మీడియాలో లేదా డైరెక్ట్‌గా వారిని ఏకి పారేసే వరకు విజయ్‌ ఫ్యాన్స్‌ ఊరుకోరు. విజయ్‌ ఫ్యాన్స్‌ల్లో ఎక్కువ సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారు ఉంటారు. అందుకే ఆయన ఏ పోస్ట్‌ పెట్టినా, ఆయన ఏ సినిమా వీడియోలకు అయినా విపరీతమైన వ్యూస్‌ వస్తాయి.

తాజాగా విజయ్‌, సమంత జంటగా తెరకెక్కిన ‘మెర్సెల్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. బాలీవుడ్‌ సినిమాలు కొన్ని గంటల్లో మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం చాలా కామన్‌. ఇప్పుడు సౌత్‌ సినిమాలు కూడా ఒకటి రెండు గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అయితే పది మిలియన్‌ల వ్యూస్‌ అంటే కోటి వ్యూస్‌ను దక్కించుకోవడం అంటే కాస్త కష్టమే. కాని విజయ్‌ మాత్రం కేవలం 24 గంటల్లోనే కోటి వ్యూస్‌ను దక్కించుకుని బాలీవుడ్‌ ఫిల్మ్‌లకు తన సినిమా ఏమాత్రం తీసిపోలేదు అంటూ నిరూపించాడు. అట్లీ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ విభిన్నంగా కనిపించనుండటంతో పాటు, ట్రైలర్‌ చాలా బాగా కట్‌ చేశారు. అందుకే అతి తక్కువ సమయంలోనే కోటి వ్యూస్‌ను ఈ సినిమా టీజర్‌ దక్కించుకుంది. సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డులను ఈ సినిమా సాధిస్తుందో అని విజయ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.