‘మగధీర 2’.. విజయేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర కామెంట్స్‌

Vijayendra Prasad About Magadheera 2 With Chiranjeevi And Ram Charan

Posted September 13, 2017 (2 weeks ago) at 15:25 

దర్శకధీరుడు రాజమౌళి, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్‌ హిట్‌ అయిన ‘మగధీర’ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం గుర్తు ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని సినిమాగా, ఒక తెలుగు సినిమా పరిశ్రమ అద్బుత కావ్యంగా మగధీర ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా అప్పట్లో సాధించిన రికార్డులు మామూలువి కాదు. అలాంటి కాంబినేషన్‌ గురించి మళ్లీ చర్చ జరుగుతుంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా చరణ్‌తో ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు చరణ్‌, రాజమౌళిల కొత్త సినిమా మగధీర 2 అనే పుకార్లు కూడా గుప్పుమంటున్నాయి.

మగధీర 2 పుకార్లపై రాజమౌళి తండ్రి మరియు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మగధీర 2 స్క్రిప్ట్‌ గురించి ఆలోచించలేదని, అయితే తనకు మాత్రం చిరంజీవి, రామ్‌ చరణ్‌లతో కలిపి ‘మగధీర 2’ సినిమాకు స్క్రిప్ట్‌ను సిద్దం చేయాలని ఉంది. తాను చేసిన ఆ స్క్రిప్ట్‌ను రాజమౌళి తెరకెక్కించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చాడు. ఈ కోరిక ఎప్పటికి తీరుతుంది అనే విషయంపై క్లారిటీ లేదు. రాజమౌళి తర్వాత సినిమా ఒక వేళ రామ్‌ చరణ్‌తో ఉన్నా కూడా ‘మగధీర 2’ మాత్రం కాదని విజయేంద్ర ప్రసాద్‌ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. ఈ వారం విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవల్లీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని వార్తలు:

వివేగం ఒక ఫ్లాప్‌ మూవీ

బిగ్‌బాస్‌ సీజన్‌కే ఈ ఎపిసోడ్‌ హైలైట్‌