శ్రీవల్లీ ఫ్లాప్‌కు కారణం నేనే

vijayendra-prasad-apologizes-to-producer-over-srivalli-movie-flop

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులోనే కాకుండా పలు బాలీవుడ్‌ సినిమాలకు కథలను అందించి స్టార్‌ రచయితగా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా ‘రాజన్న’. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే విమర్శకుల ప్రశంసలు మాత్రం ఆ సినిమాకు దక్కాయి. ఇక రెండవ ప్రయత్నంగా విజయేంద్ర ప్రసాద్‌ ‘శ్రీవల్లీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. విభిన్న కథాంశంతో సైన్స్‌ఫిక్సన్‌ సినిమాతో ఈసారి దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యింది. ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజే అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. దాంతో సినిమా పెట్టిన పెట్టుబడిలో కనీసం సగాన్ని కూడా రాబట్టలేక పోయింది. ఈ సినిమా ఫ్లాప్‌కు పూర్తి కారణం తానే అని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించడంలో విఫలం అయ్యాను అంటూ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు, కాని వారికి తగ్గ ఔట్‌పుట్‌ ఇవ్వలేదు. నేను చూపించిన జోనర్‌ ప్రేక్షకులకు అర్థం కాలేదని, వారు నేను తీసిన సినిమా అర్థం కాకపోవడంతో ఆధరించలేదు అంటూ తేల్చి చెప్పారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈసారి మంచి నేపథ్యంతో సినిమాను తీస్తాను అంటూ విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.