డేరా బాబా గుహలో 6 జంటలు… 28 రోజులు.

Vishwas Gupta says Honeypreet and Gurmeet Naked in Bed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డేరా సచ్చా సౌధా గుర్మీత్ గురించి రోజుకో రకమైన విషయం బయటికి వస్తోంది. తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్ ఫీవర్ లో వున్న తెలుగు ప్రజలకి ఆసక్తి కలిగించే విషయం ఇంకోటి వెలుగు జూసింది. ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్ తరహాలోనే డేరా లో కూడా ఓ కార్యక్రమం జరిగేదట. డేరా బాబా కనుసన్నల్లో నిర్బహించే ఓ గుహ లాంటి ప్రాంతంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 6 జంటలు పాల్గొనేవి. 28 రోజుల పాటు వాళ్ళు అక్కడ వుండేవాళ్ళు. అక్కడ జరిగే వ్యవహారాల్ని సీక్రెట్ కెమెరాస్ ద్వారా బాబా ఎప్పటికప్పుడు చూసేవారు. అక్కడ ఆ డేరా బాబా బిగ్ బాస్ గుహలోఆ జంటలు ఏమి చేసేది, ఆ బాబా ఏమి చూసేది అనేది మాత్రం రహస్యం.

ఈ బిగ్ బాస్ టైపు వ్యవహారాన్ని డేరా బాబా నడిపిన విషయాన్ని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా బయటపెట్టాడు. హనీప్రీత్ బాబాతో అసభ్యంగా ఉండటం తాను కళ్లారా చూసినట్టు గుప్తా చెప్పారు. అప్పటినుంచి తనకి బెదిరింపులు ఎక్కువ అయినట్టు విశ్వాస్ వివరించారు . బాబా, హానిప్రీత్ వార్నింగ్ లతో భయపడిన విశ్వాస్ ఇన్నాళ్లు మౌనం వహించాడు. ఇప్పుడు మీడియా ముందుకి వచ్చి తనకి తెలిసిన బాబా రహస్యాలు బయటపెడుతున్నాడు. ఇలాగే ఒకప్పుడు బాబా దగ్గర ఉండి ఆయన చర్యలతో భయపడ్డ చాలా మంది ఇప్పుడిప్పుడే నోరు తెరిచి నిజాలు చెబుతున్నారు. వాళ్ళు ఒక్కో విషయం చెబుతుంటే బాబా ఎంత క్రూరుడో అర్ధం అవుతోంది.