అందుకే… సామాజిక స్మ‌గ్ల‌ర్లు అన్నాను…

writer kancha ilaiah gets threats calls over arya vysya book

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ సామాజిక ర‌చ‌యిత కంచె ఐల‌య్య వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. త‌న పుస్త‌కానికి సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అన్న టైటిల్ పెట్ట‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు. ఆర్య‌వైశ్యులు ప్ర‌జాస్వామ్యాన్నిరోడ్ల‌పై త‌గుల‌బెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఆర్య‌వైశ్యుల‌కు స‌మాజంలో ఉన్న స్వేచ్ఛ ద‌ళితులు, బీసీల‌కు లేద‌ని ఆయ‌న ఆరోపించారు. దేశంలో కింది కులాల వారు నిర్వ‌హించే ఆందోళ‌న‌ల‌నల‌కు అనుమ‌తి ఇవ్వ‌ర‌ని… అగ్ర‌కులాల‌కు మాత్రం ఎలాంటి ఆంక్ష‌లూ ఉండ‌వ‌ని ఐల‌య్య విమ‌ర్శించారు. వాక్ స్వాతంత్యాన్ని బ‌తికించుకోటానికి పోరాడాల్సి ఉంద‌న్నారు.

గాంధీ,నెహ్రూ, అంబేద్క‌ర్ లను గౌర‌విస్తాన‌ని చెప్పిన ఐల‌య్య పుస్త‌కం రాసుకుని అభిప్రాయాన్ని తెలిపే హ‌క్కును త‌న‌కు అంబేద్క‌ర్ ఇచ్చార‌ని తెలిపారు. త‌న పుస్త‌కానికి ఆ టైటిల్ పెట్ట‌టానికి ఓ కార‌ణం ఉంద‌న్నారు ఐల‌య్య‌. కోమ‌టోళ్లు కింది కులాలు త‌యారుచేసిన ఉత్ప‌త్తుల్ని అతి త‌క్కువ ధ‌ర‌కు తీసుకుని, తిరిగి వారికే ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకునేవార‌ని, అందుకే త‌న పుస్త‌కానికి సామాజిక స్మ‌గ‌ర్లు అని టైటిల్ పెట్టాన‌ని ఐల‌య్య స‌మ‌ర్థించుకున్నారు. గౌరీ లంకేశ్ ను చంపి ఆమె ఆలోచ‌న‌ల్ని బొంద‌పెట్టార‌ని, రేపు త‌న‌ను చంపాల‌ని చూస్తున్నార‌ని ఐల‌య్య ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

మరిన్ని వార్తలు:

అవును…కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థిని నేనే

లగడపాటిని బాబు ఎందుకు పిలిచారబ్బా ?

ఆ నంద్యాల పాఠం ఇక్కడ నల్గొండలో చెబుతారా ?