ఎన్టీఆర్ తో వైసీపీ మైండ్ గేమ్

YCP Mind Game With NTR Entering Politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కెరీర్ పీక్ స్టేజి లో వున్న ఎన్టీఆర్ తో తన రాజకీయ అవసరాల కోసం వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. సీఎం చంద్రబాబు, బాబాయ్ బాలయ్యతో ఎన్టీఆర్ కి వున్న దూరాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని ఎలాగైనా ముగ్గులోకి లాగాలని వైసీపీ గతంలోనూ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మీద కూడా కన్నేసింది. అయితే 2009 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాల్ని దగ్గరగా చూసిన ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల జోలికి వెళ్లకుండా హాయిగా సినిమాలు చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అదే చెప్పారు. చేస్తున్నారు కూడా. కానీ తాజాగా వైసీపీ అనుకూల సోషల్ మీడియా గతంలో బూజు పట్టిన ఆ పుకారుని మళ్ళీ ప్రచారంలోకి తెచ్చింది.YCP Mind Game With NTR Entering Politics

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు త్వరలో వైసీపీ లో చేరబోతున్నాడని ఆ పుకార్ల సారాంశం. చంద్రబాబు మేనకోడల్ని వివాహం చేసుకున్న నార్నె శ్రీనివాసరావు మీద కిందటి ఎన్నికల ముందు కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి. కానీ అలా జరగలేదు. నిజానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ లోకి వెళ్లడమే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లనిచ్చిన మామ అలా చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఎన్టీఆర్ కి తెలుసు. నాని పార్టీ మారిన ప్రభావం కొన్ని సినిమాల మీద పడ్డ విషయం కూడా ఎన్టీఆర్ గ్రహించారు. అందుకే ప్రస్తుతానికి తన పని తాను చేసుకుందాం అనుకుంటున్నారు.

ఈ విషయం తెలిసి కూడా ఓ వైపు చంద్రబాబు చాణక్యం, ఇంకో వైపు పవన్ ప్రజాకర్షణ మంత్రం మధ్య నలిగిపోతున్న వైసీపీ ఎలాగైనా ఎన్టీఆర్ ని మధ్యలోకి తెచ్చి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ ప్రచారాల్ని, వ్యూహాల్ని మొగ్గలోనే తుంచివేసే దిశగా ఎన్టీఆర్ అడుగులేస్తే బెటర్.