కాజోల్ తో యువీ సెల్ఫీ…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌నం అభిమానించే హీరో హీరోయిన్లు క‌న‌ప‌డితే వారితో ఒక్క ఫొటో దిగ‌కుండా ఉండ‌లేం. సెల్ఫీల కాలంలో అంద‌రూ ఇప్పుడు త‌మ అభిమాన హీరోనో, హీరోయిన్నో క‌న‌ప‌డితే వెంట‌నే వారితో ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ , వాట్స‌ప్, ఇన్ స్టాగ్రామ్ ల్లో పోస్టు చేస్తున్నారు. సెల‌బ్రిటీలు ఇందుకు మిన‌హాయింపు కాదు. క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్… తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్ లో ఇప్పుడ‌ది వైర‌ల్ అవుతోంది. ఎయిర్ పోర్టులో అనుకోకుండా తార‌స‌ప‌డిన బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ కాజోల్ తో యువీ సెల్ఫీ దిగాడు. కాజోల్ భుజంపై చెయ్యి వేసి యువ‌రాజ్ న‌వ్వుతూ సెల్ఫీ తీసుకున్నాడు. సోష‌ల్ మీడియాలో ఆ సెల్ఫీని పోస్ట్ చేసి విమానం రాక ఆల‌స్యం కావ‌డంతో అభిమాన న‌టితో యువీ సెల్ఫీ టైం అని క్యాప్ష‌న్ రాశాడు. ఇదే ఫొటోను కాజోల్ కూడా త‌న ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసుకుంది.

Yuvraj Singh Take Selfie With Kajol in Airport