అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ మృతి

అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ మృతి

అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ పాట్రిక్‌ డే తీవ్ర గాయాల వల్ల ప్రాణాలు విడిచాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన పోయిన పాట్రిక్‌ నాలుగు రోజులు పోరాడి తుదిశ్వాస విడిచాడు.బాక్సింగ్‌ బౌట్‌లో ప్రత్యర్థి నుంచి వచ్చిన పంచ్ లతో తలకు తీవ్ర గాయాలు కావడంవల్ల కోమాలో ఉన్నాడు.

జూనియర్‌ మిడిల్‌వెయిట్‌ చాంపియన్‌షిప్‌ చికాగోలో చార్లస్‌ కాన్‌వెల్‌తో ఆడిన మ్యాచ్‌లో బాక్సర్‌ పాట్రిక్‌ డే నాకౌట్‌ అయ్యాడు. ప్రత్యర్థుడు చార్లస్‌ కాన్‌వెల్‌ నుండి వచ్చిన పంచ్‌లవల్ల రింగ్‌లో పడిపోయాడు.

ఆస్పతికి తరలించి చికిత్స అందించగ, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం ప్రయత్నాలు చేసిన ఫలితంలేకుండా పోయింది. మృత్యువుతో నాలుగు రోజులు పోరాడి ప్రాణం విడిచాడు. ప్రకటన ద్వారా పాట్రిక్‌ డే ప్రమోటర్‌ డిబెల్లా ఈ విషయాన్ని తెలిపాడు.