అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం – మరిచిపోలేనంటూ అల్లు అర్జున్ ట్వీట్

అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం
అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం

సినీ రంగంతో అల్లు ఫ్యామిలీకి విడ‌దీయ రాని సంబంధం ఉంది. అల్లు రామ‌లింగ‌య్య సీనియ‌ర్ క‌మెడియ‌న్‌గా త‌న‌దైన ముద్ర వేశారు. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోగా మంచి గుర్తింపు పొందారు. అల్లు రామ‌లింగ‌య్య త‌న‌యుడు అల్లు అర‌వింద్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉన్నారు. ఇక అర‌వింద్ కుమారుడు అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే నేటి త‌రం అగ్ర హీరోల్లో ఆయ‌న ఒక‌రు.

అంతే కాకుండా.. పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ వద్ద స‌త్తా చాటుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి మ‌రో జ‌న‌రేష‌న్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది. అదెవ‌రో కాదు.. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ‌.

Allu Arha entry in film industry.
Allu Arha entry in film industry.

డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన లేటెస్ట్ చిత్రం శాకుంత‌లం. పౌరాణిక ప్రేమ గాథ‌. ఈ సినిమాలో దుష్యంతుడు, శ‌కుంత‌ల కుమారుడు భ‌ర‌తుడి చిన్ననాటి పాత్ర‌లో అర్హ న‌టించింది. శుక్ర‌వారం శాకుంత‌లం సినిమా రిలీజైంది. అందులో భ‌ర‌తుడిగా న‌టించిన అర్హ న‌ట‌న‌ను అంద‌రూ ప్రశంసిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శాకుంత‌లం టీమ్‌కు విషెష్ చెబుతూ, త‌న కుమార్తె అర్హ ఎంట్రీ గురించి స్పందించారు.

‘‘శాకుంత‌లం టీమ్‌కు అభినంద‌న‌లు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన గుణ శేఖ‌ర్‌గారు, నీలిమ గుణ‌గారు, శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి శుభాకాంక్ష‌లు. స్వీటెస్ట్ లేడీ స‌మంత, మ‌ల్లు బ్ర‌ద‌ర్ దేవ్ మోహ‌న్‌కి కంగ్రాట్స్‌. మీ అంద‌రికీ చిన్న అతిథి పాత్ర చేసిన అల్లు అర్హ న‌చ్చే ఉంటుంది. త‌ను ఎంతో బాగా చూసుకుని వెండితెర‌కు ప‌రిచయం చేసి గుణ‌గారికి ధ‌న్య‌వాదాలు. ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాం’’ అంటూ తన ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.