‘కట్టప్ప’ తనయుడు హీరోగా మాయోన్ చిత్రం ….

కట్టప్ప పాత్రలో ఎనలేని గుర్తింపు పొందిన తమిళనటుడు సత్యరాజ్. ఆయన తనయుడు శిబి సత్యరాజ్ నటించిన చిత్రం ‘మాయోన్’. మైథలాజికల్ సైన్స్ ఫింక్షన్​గా కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ చిత్రం అదే పేరుతో తెలుగులో జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా మయోన్ తెలుగు ట్రైలర్​ను విడుదల చేశారు