చంద్రబాబు నాయుడు అరెస్ట్‌..ఆర్టీసీ బస్సులు బంద్ !

Chandrababu Naidu arrested..RTC buses closed!
Chandrababu Naidu arrested..RTC buses closed!

నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో ఏ1గా ఉన్న బాబుని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. విజయవాడకు తరలిస్తున్నారు. అయితే.. కుప్పం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేశారనే సమాచారంతో కుప్పంలో బంద్‌ వాతావరణ చోటు చేసుకుంది

ఇందులో భాగంగానే.. ఏపీఎస్ఆర్టీసీ కుప్పం డిపో నుంచి బస్సులు బయటకు రాకపోవడం లేదు. దీంతో కుప్పంలో బంద్ వాతావరణాన్ని తలపిస్తుంది. అటు కుప్పం పట్టణంలో కిరాణా షాపులను మూసివేస్తున్నారు పోలీసులు. మరోపక్క ముందస్తు పోలీసులు సిబ్బంది కొంత మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.నారా లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను పోలీసులు అడ్డుకున్నారు .ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి పోలీసులు హై డ్రామా సృష్టిస్తున్నారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని పోలీసులు చెబుతున్నారు .