నడవలేని స్థితిలో నిత్యా మీనన్..కాలుకు పెద్ద గాయం..

‘అలా మొద‌లైంది..’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మెరుపులు మెరిపించింది నిత్య‌ మీన‌న్ . తెలుగు, త‌మిళ, మ‌లయాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేసి దూకుడు చూపించిన స్టార్ హీరోయిన్… రీసెంట్ గా పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్‌తో తెలుగు ప్రేక్ష‌కులను ప‌లుక‌రించింది నిత్యా మీనన్. తను నటించిన ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. జూలై 8న వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లోనే వెబ్ సిరీస్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. . నడవలేని స్థితిలో కార్యక్రమానికి హాజరై తన అభిమానులను కంగారు పెట్టింది. వేదికపై కర్రసాయం మరియు బాడీ గార్డ్స్ సాయంతో నడుచుకుంటూ రావడంతో అసలేమైందనీ అందరూ ఆందోళన చెందారు. ఇందంతా ప్రమోషన్ లో భాగామేనా అని సందేహించారు. కానీ నిజంగానే నిత్యా మీనన్ కాలుకి గాయం అయ్యింది. ఇంట్లో జారి పడటంతో కుడి కాలుకు దెబ్బ బలంగా తాకింది. అయినా ఈవెంట్ కు హాజరవడం విశేషం.