నన్ను భారతదేశ అల్లుడిగా పిలుస్తారు: రిషి సునక్

I am known as the son-in-law of India: Rishi Sunak
I am known as the son-in-law of India: Rishi Sunak

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు. లండన్ నుండి బయలుదేరడానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. తనను భారతదేశ అల్లుడిగా వ్యవహరిస్తారని, ఆప్యాయతతో అలా పిలుస్తారన్నారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షితామూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు అక్షిత కూడా భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

జి20 సదస్సుకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకే రావడం లేదని రిషి సునాక్ మండిపడ్డారు. కావాలనే ఈ సమ్మిట్‌కి దూరంగా ఉన్నారని, విమర్శలు వస్తాయని ఆయనకీ తెలుసని అన్నారు. “జి20 సదస్సుకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకనే రావడం లేదు. కావాలనే అందరికీ దూరంగా ఉంటున్నారు. విమర్శలు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు. ఈ సదస్సులో పాల్గొనే దేశాలు కచ్చితంగా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చిస్తాయి. సమస్య పరిష్కారానికి యూకే అన్ని విధాలుగా సహకరిస్తుంది. రష్యాపై మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునందున తగిన చర్యలు తీసుకునేందుకు భారత్‌ కీలక పాత్ర పోషించనుంది. త్వరలోనే ఈ సైనిక చర్య ముగిసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది” అని ఆయన అన్నారు .