ప్రభాస్ “సలార్” మూవీ లో హీరోయిన్ ఎవరు ?

ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన చిత్రం “సలార్” ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇపుడు అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించి ప్రశాంత్ నీల్ సాలిడ్ ప్లానింగ్ లు వేస్తున్న టాక్ ఆ మధ్యనే వచ్చింది.

అయితే ఈ సినిమా లో హీరోయిన్  విషయానికి వస్తే  ముందు దిశా పటాని పేరును అనుకున్నట్లు తెలిసిందే. మరి ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది. ఈ ఫీమేల్ లీడ్ కు గాను ఇప్పుడు మళ్ళీ పూజా హెగ్డే పేరు కూడా రేస్ లోకి వచ్చినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పూజతో “రాధేశ్యామ్” సినిమా చేస్తున్నాడు. మరి ఇందులో కూడా పూజా హెగ్డే ఉందా లేదా అన్నది చూడాలి.