‘బాలా.. సైతాన్ కా సాలా’ వార్నర్ డ్యాన్స్ ను మెచ్చిన కోహ్లీ

India-captain-Virat-Kohli-E

కరోనా లాక్ డౌన్ కాలాన్ని అంది వచ్చిన వరంగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రముఖ క్రికెటర్స్. అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ మాత్రం టిక్ టాక్ లతో అభిమానులకు మరింత చేరువౌతున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో టిక్‌టాక్ వేదిక‌గా నెటిజ‌న్స్‌కి ప‌సందైన వినోదాన్ని వార్నర్ పంచుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహంలేదు.

ముఖ్యంగా వార్నర్ తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన పాట‌ల‌కి స్టెప్పులు వేస్తూ.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌కి యాక్ష‌న్ చేస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. తాజాగా అక్ష‌య్ కుమార్ న‌టించిన హౌజ్‌ఫుల్ 4 చిత్రంలోని ‘బాలా.. సైతాన్ కా సాలా’ అనే సాంగ్‌కి త‌న‌దైన స్టైల్‌లో డ్యాన్స్  చేసి బాలీవుడ్ ని అలరిస్తున్నారు. కాగా ఈ వీడియోకి భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ న‌వ్వుతున్న ఎమోజీల‌ని కామెంట్ రూపంలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన వార్న‌ర్.. అనుష్క‌తో క‌లిసి డ్యూయ‌ట్ చేయ‌మ‌ని తన కోరికగా వెల్లడించాడు. మొత్తానికి లాక్‌డౌన్ తో క్రికెట్‌కి దూరంగా ఉంటున్న క్రికెట‌ర్స్ సోష‌ల్ మీడియా  వేదికగా పసందైన వినోదాన్ని పంచుతుండటం విశేషం.