బిగ్ బాస్ 4 లేటెస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ …

బిగ్ బాస్ 4 లేటెస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ ...

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద షో బిగ్ బాస్‌ అని మన అందరికి తెలిసిందే . బిస్ బాస్ 4 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షుకులు ఎదురుచూస్తున్నారు ఆ టైం వచ్చేసింది మరి ఆ డేట్ ఎప్పుడో తెలుసుకుందామా .

బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది.ఈ షో ద్వారా వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు.

అయితే ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్‌గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది.

1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి
2. యాంకర్ లాస్య మంజునాథ్
3. జబర్దస్త్ అవినాష్
4. యుట్యూబ్ గంగవ్వ
5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్
6. సింగర్ నోయల్
7. హీరోయిన్ మొనాల్ గుజ్జార్
8. యాంకర్, యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక
9. యాంకర్ అరియానా గ్లోరీ
10. యాంకర్ తనూజా పుట్టాస్వామి
11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్
12. యూట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే
13. కరాటే కళ్యాణి (
14. డైరెక్టర్ సూర్య కిరణ్

అయితే ఈ లిస్ట్ లో సగానికిపైగా యాంకర్లు.. టీవీ ఇండస్ట్రీలకు చెందినవారే ఉన్నారు మరి గతంతో పోల్చుచుంటే కాస్త సినీ గ్లామర్ తగ్గినట్టుగానే అనిపిస్తుంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లు షోలు కనిపిస్తారా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకూ వెయిట్ చేయాల్సిందే .