భర్తకు బాలీవుడ్ భామ రొమాంటిక్ కిస్.. వైరల్

బాలీవుడ్ రొమాంటిక్ క‌పుల్ దీపికా ప‌దుకొణే- ర‌ణ్‌వీర్ సింగ్. వీరిద్దరూ చూడముచ్చటగా బెస్ట్ కపుల్ గా బాలీవుడ్ కే ఆదర్శవంతం అనిపించేలా లవ్ మ్యారేజ్ ని చాలా ఘనంగా చేసుకున్నారు. అయితే తాజాగా లాక్‌డౌన్‌ కాలాన్ని చాలా ప్రశాంతంగా.. ఫుల్‌ గా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో సమయం ఎక్కువగా దొరకడంతో దీపిక త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ కోసం వంట‌కాలు నేర్చుకొని మ‌రీ స్వయంగా వండి పెడుతుంది. ఇందుకు సంబంధించిన‌ ఫోటోలు కూడా అప్పుడ‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఆ సోషల్ షేరింగ్ లో భాగంగా తాజాగా సండేరోజు నాడు దీపికా త‌న భ‌ర్త బుగ్గ‌పై ఘాటుగా పెట్టిన ముద్దుకి సంబంధించిన వీడియోని షేర్ చేసేసింది. ఈ వీడియోకి ప్రపంచంలోని అంద‌మైన ముఖం అని కామెంట్ కూడా చేసేసింది. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేసేస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో నెటిజ‌న్లని చాలా బాగా ఆకట్టుకోవడంతో కామెంట్స్ కు రొమాంటిక్ గా గుప్పించేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ర‌ణ్‌వీర్, దీపికాలు గ‌త రెండు నెల‌లుగా ముంబైలోని త‌మ ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం విదితమే.